Polling: పోలింగ్ ముందు 48 గంటలు సైలెంట్ పిరియడ్
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకొనుటకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని,పోలింగ్ ముందు 48 గంటలు నేటి (శనివారం ) సాయంత్రం 5 గంటల నుండి తేది 13 న సాయంత్రం 6 గంటలు.. పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ ఉంటుందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఉచిత పంపిణీలు చేస్తే చర్యలు తప్పవు
ఉల్లంఘనలు సి.విజిల్ ఆప్ ద్వారా పిర్యాదు చేయవచ్చు
జిల్లా ఎస్పి చందనా దీప్తి
ప్రజా దీవెన నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) దృష్ట్యా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకొనుటకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని,పోలింగ్ ముందు 48 గంటలు నేటి (శనివారం ) సాయంత్రం 5 గంటల నుండి తేది 13 న సాయంత్రం 6 గంటలు.. పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ ఉంటుందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.
ఈ మేరకు ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సైలెన్స్ పీరియడ్ లో రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమలు లో ఉంటుందని, ఎవ్వరూ 5 గురి కంటే ఎక్కువ గుంపులుగా ఉండ కూడదని అన్నారు.ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే నగదు, మద్యం,ఇతర వస్తువుల రవాణా పై మరింత పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎవరైన ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత పంపిణీలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్(Election code) ఉల్లంఘన పిర్యాదులు సి.విజిల్ ఆప్ ద్వారా పిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల భద్రతా దృష్ట్యా ఎన్నికలు సజావుగా సాగటానికి నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి నిబంధనలు….
నేటి (శనివారం ) సాయంత్రం 5 గంటల నుండి సోమవారం ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో 5 మంది కంటే ఎక్కువ వ్యక్తులతో ఉండడం నిషేదం.
పోలింగ్ కు 48 గంటల ముందు నుండే ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు, ఇంటింటా ప్రచారం లాంటివి చేయవద్దు.
వేరే నియోజక వర్గం నుండి ప్రచారానికి వచ్చిన వాళ్లు స్థానికంగా ఏవ్వరూ ఉండకూడదు.
లాడ్జ్ లు, గెస్ట్ హౌస్ లు, హోటళ్లలో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు, రాజకీయ పార్టీ ల వారు నేటి సాయంత్రం 5 గంటల లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలలి
లాడ్జీలలో, హోటళ్లలో బస చేయడానికి ఎవ్వరయిన హస్పటల్ గురించి మరి ఏ ఇతర వ్యక్తిగత కారణాలతో వచ్చినట్లయితే వారు పూర్తి వివరాలు, గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత అనుమతించాలి. వారు వచ్చిన సమయం, వెళ్లిన సమయం పూర్తి వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలి, లాడ్జీకి,హోటల్ కి రాజకీయ పార్టీల వ్యక్తులు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు లేని వ్యక్తులు బస చేయడానికి వస్తే వారిని అనుమతించవద్దు. వారి గురించి సంబంధిత పోలీసులకు తెలియజేయాలి.
మద్యం దుకాణం యాజమానులు టోకెన్ విధానంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు, వ్యక్తు లకు మద్యం అమ్మితే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రజల యొక్క ఓట్లు పొందడానికై ఎవరైనా లేదా ఏ రాజకీయ పార్టీలు అయినా ఎలాంటి మైక్ లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను ఉపయోగించి ప్రచారం చేయడం, సమూహముగా ఉన్నట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
13 నాడు ఓట్లు వేసే రోజు ఓటర్లను ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీ బ్యానర్లు లేదా లోగోలతో షామియానా, మొదలైన నిర్మాణాలను ఏర్పాటు చేయకూడదు.
పోలింగ్ జరిగే రోజు పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అంతరాయం కలిగించే విధంగా ఉండరాదు.
పోలింగ్ కేంద్రాల్లో కి సెల్ ఫోన్లు,ఎలాక్రానిక్ వస్తువులు, మండే పదార్థాం లేదా ఇతర పదార్థాలను తీసుకెళ్లరాదు.
పోలీంగ్ స్టేషన్ సమీపంలో 100 మీటర్ల పరిధిలో ఉన్న ఇండ్ల యాజమానులు బయటి వ్యక్తులను ఎవ్వరిని అనుమతించకూడదు. అలాగే పోలీంగ్ స్టేషన్ సమీపంలో 100 మీటర్ల పరిధిలో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన వారి ఇండ్ల యాజమానులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఓటర్లను ఎవ్వరు కూడా ప్రలోభపెట్టకూడదు, బయబ్రాంతులకు గురిచేయవద్దు. ప్రామిస్ (ఒట్టు) చేయించరాదు. ఎవ్వరయిన పై విధంగా చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకోబడును.
ఏ రాజకీయ పార్టీ వారు, ఏ వ్యక్తులు కూడా ఓటర్లను ఓటింగ్ కేంద్రాలకు వాహనాలలో తరలించరాదు.ట్రాన్స్ పోర్ట్ చేయరాదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున, పై నిబంధనలను ఏ పార్టీవారయిన, ఏ వ్యక్తులయిన ఉల్లంఘించినట్లు అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
Everyone follow election rules