ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ బత్తాయి రైతు (Mosambi Farmers)లకు జరుగుతున్న ఇబ్బందులు నష్టపోతున్న విధానం, దళారి వ్యవస్థ (Broker system), మార్కెటింగ్ సమస్యల (marketing issues)పై రైతులు నల్లగొండ జిల్లా కలెక్టర్ (Nalgonda District Collector)కు వినతిపత్రం సమర్పించారు. క్షేత్ర స్థాయి నివేదిక (Field level report) తెప్పించుకొని వచ్చే పది రోజుల్లోనే బత్తాయి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వినతిపత్రం (petition) సమర్పించిన వారిలో కార్యక్రమంలో బత్తాయి రైతులు నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పులి మామిడి శ్రీనివాస్, చిర్ర భూపాల్, చిలుక వెంకట్ రెడ్డి, మారేపల్లి ప్రదీప్, కండిమళ్ళ శివారెడ్డి, తాటి మాధవ్ రెడ్డి, దుదిపాల శ్రీనివా సరెడ్డి, గోగు రవి కుమార్, కుందూరు కిరణ్ రెడ్డి, A. గిరిరాజు, బోధనపు వెంకటరెడ్డి, శీలం శేఖర్ రెడ్డి, కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి,పాల కూరి శ్రీనివాస్, కోమర బోయిన నాగయ్య, తదితర రైతులు పాల్గొన్నారు.