Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Food Processing Center : బిజెపిని గెలిపిస్తే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు

ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఉండే నల్గొండలో బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తే నల్గొండలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ను నెలకొల్పేదుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రీజీజు హామీ ఇచ్చారు

కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజీజు

తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుస్తాం

జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా చేసింది ఏమీ లేదు

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

 నల్గొండ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్

 నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ

ప్రజా దీవెన నల్గొండ బ్యూరో: ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఉండే నల్గొండలో(Nalgonda) బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తే నల్గొండలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ను నెలకొల్పేదుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ (Kiran)రీజీజు హామీ ఇచ్చారు. సోమవారం నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పట్టణంలో వివేకానంద విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశం కోసం మోడీ నల్గొండలో సైదిరెడ్డి నినాదంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలన్నారు. దేశంలో మహిళలందరూ మోడీకి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, నల్గొండలో కూడా మహిళలతో పాటు యువత సైదిరెడ్డికి (Saidi reddy) మద్దతుగా నిలిచి కమలం గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దేశంలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు ఆదివాసీలు ట్రైబల్స్ అభ్యున్నతికి మోడీ కృషి చేస్తున్నారని, ఆదివాసీని రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీదే అన్నారు.

ప్రజలు మేధావులతో పాటు రైతులు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు మోడీకి మద్దతుగా ఉన్నారని హిందువులంతా నరేంద్ర మోడీ, బిజెపికి ఓటు వేయాలని కోరారు. సైదిరెడ్డి నల్గొండ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండను మరింత అభివృద్ధి చేస్తామని, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్(Food processing center) నెలకొల్పడంతో నల్లగొండ జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని యువత ఆలోచించి వినియోగించుకోవాలన్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని 17 సీట్లలో బిజెపి అభ్యర్థులు గెలవబోతున్నారని, హైదరాబాద్ కూడా ఈసారి బిజెపి ఖాతాలో చేరబోతుందన్నారు. నల్లగొండ గడ్డ కాశగడ్డగా మారిపోయిందనీ, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల పదవులను ఊడగొట్టాలన్నారు. జిల్లాలో బీజేపీ ఎంపీలు లేకపోయినా నాలుగు లైన్ల రహదారులతో పాటు స్మశాన వాటికలు, గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత నరేంద్ర మోడీది అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ను ఓడ గొట్టిన మనం నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులను ఒడగొట్టాలేమా ప్రజలు ఆలోచించాలన్నారు. 2028లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వమేనని, నల్గొండలో పార్లమెంటు అభ్యర్థి సైదిరెడ్డిని రెండు లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అడిగిన ప్రజలు బిజెపికి (BJP) ఓటు వేస్తామంటున్నారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మీ ర్యాలీలకు డబ్బులు కావాలి కానీ బీజేపీ ర్యాలీలకు కాషాయ జెండా మాత్రమే చాలు అన్నారు.

మూడు నెలల కాలంలో సీఎం గ రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని వ్యతిరేక ఓటు వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ పేరు చెప్పి ఓట్లు అడిగితే ఉన్న నాలుగు ఓట్లు కూడా పోతాయని దేశ రక్షణ, దేశాభివృద్ధి కోసం, ప్రపంచ గురువుగా దేశాన్ని నిలిపేందుకు మోడీ కృషి చేస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలో కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే రాజ్యమేలుతున్నయని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. బిజెపి అంటే యువత అని, యువత అనుకుంటే సాధించలేనిది ఏది లేదన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 400 సీట్లతో ఉంటాడన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని లోకల్ బాడీ ఎలక్షన్ లతోపాటు వివిధ కార్పొరేషన్ ఎలక్షన్లలో కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు వస్తాయన్నారు. సమిష్టి కృషితో నల్లగొండలో బిజెపి గెలిపించినందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, గోలి మధుసూదన్ రెడ్డి, నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, కనుమంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పోతెపాక సాంబయ్య, వివిధ మోర్చాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

నామినేషన్ దాఖలు చేసిన శానంపూడి..
నల్గొండ బిజెపి పార్లమెంట్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి సోమవారం నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. పార్టీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు, మాదగోని శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్, గోలీ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తో కలిసి ఆయన జిల్లా ఎన్నికల అధికారి, ఆర్ఓ దాసరి హరిచందన కు నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఆస్తులు రూ.31.33 కోట్లు..6.10 కోట్లా అప్పు

 

నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానం పూడి సైదిరెడ్డి తన కుటుంబ ఆస్తులు 31,33,55,479 ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో చూపించారు. అదేవిధంగా రూ.6,10,9,131 అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. సోమవారం నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తన చేతిలో రూ.45వేల నగదు ఉన్నట్లు అఫిడవిట్ లో చూపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ డీసీసీబీ బ్యాంకులో రూ.7,97,650, యూనియన్ బ్యాంకులో రూ.3,60,940, ఎస్బీఐలో రూ.18,17,072, ఐసీఐసీఐ బ్యాంకులో రూ.10లక్షల డిపాజిట్లు ఉన్నట్లు ఆఫిడవిట్లో చూపించారు

. తన భార్య చేతిలో రూ.45వేల నగదు, హైదరాబాద్ లోని డీసీసీబీ బ్యాంకులో రూ.2.95,719 డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. డిపెండెంట్-1 పేరున రూ.22,800, డిపెండెంట్-2 పేరున రూ.30,895 బ్యాంకుల్లో ఉన్నట్లు చూపించారు. సైదిరెడ్డి పేరున రూ.50వేల విలువ చేసే షేర్లు, ఆయన భార్య పేరున మరో రూ.50వేల విలువ చేసే షేర్లు చూపించారు. ఎన్ జి పవర్ ప్రాజెక్టులో తన భార్య పేరున రూ.1,57,48,752 విలువ చేసే పెట్టుబడులు ఉన్నట్లు పేర్కొన్నారు. సైదిరెడ్డి వద్ద 270 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపగా, తన భార్య వద్ద కిలోన్నర బంగారం ఉన్నట్లు చూపించారు.

స్థిర, చరాస్తులు..

సైదిరెడ్డి పేరున చరాస్తులు రూ.4,47,52,548, తన భార్య పేరున చరాస్తులు రూ.5,89,21,081 ఉన్నట్లు చూపారు. సైదిరెడ్డికి సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ లో 2.25 ఎకరాలు, మరో చోట 1.30 ఎకరాలు, 1.29 ఎక రాలు, సూర్యాపేట జిల్లా చివ్వెంలలో 3 ఎకరాల భూమి ఉన్నట్లు చూపించారు. దురాజ్పల్లిలో ఒక చోట 7,200 స్క్వేర్ యార్డ్స్, మరో చోట 31,366 స్క్వేర్ యార్డ్స్, కోదాడలో 409.5 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఉన్నట్లు చూపగా టీవీబీ పాలెంలో 438 స్క్వేర్ యార్డ్స్ స్థలంతో పాటు కెనడాలో 2 నివాస భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య పేరున షామీర్పేటలోని దేవ రయాంజాల్లో 9వేల స్క్వేర్ యార్డ్స్ భవనంతో పాటు సూర్యాపేటలోని దేశాయిగూడెంలో 12,221 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఉంది.

అప్పులు రూ.6.10 కోట్లు

సైదిరెడ్డి పేరున చరాస్తి రూ.5,34,01850 ఉన్నట్లు చూపగా.. తన భార్య పేరున రూ.15,62,80,000 స్థిరాస్తి ఉన్నట్లు చూపిం చారు. అప్పులు సైదిరెడ్డి పేరున రూ.91 లక్షలు, 5.19.9.131ఉన్నట్లు చూపించారు.

Food processing center will be BJP wins