Nominations: రెండవ రోజు నాలుగు నామినేషన్లు
లోకసభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి 4 నామినేషన్లు దాఖలయ్యాయి.
ప్రజా దీవెన నల్గొండ: లోకసభ ఎన్నికల (Lok sabha election nomination) నామినేషన్లలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా, ధర్మ సమాజ్ పార్టీ (Dharma samaj party)తరఫున తలారి రాంబాబు ఒక సెట్ నామినేషన్ ను దాఖలు చేశారు. మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) పార్టీ తరఫున వసుకుల మట్టయ్య ఒక సెట్ నామినేషన్ ను దాఖలు చేయగా, కిన్నెర యాదయ్య, స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ ను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు వీరు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Four nominations on Second day