–సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజినల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి
G Krishnamurthy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సహజ వనరుల పరిరక్షణలో పౌర సమాజం కీలక పాత్ర నిర్వర్తిం చాల్సిన అవసరం ఉందనిసెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజినల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి (G Krishnamurthy)పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (Central Ground Water Board)సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం లో రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి, ఇతర శాస్త్రవేత్తలు వివిధ అంశా లపై ప్రసంగించారు. తన ప్రసంగం లో రీజనల్ డైరెక్టర్ శ్రీ జి కృష్ణమూర్తి మాట్లాడుతూ వనరుల పరిరక్షణకు భారత ప్రభుత్వం 1986 నుండి అనేక చట్టాలను రూప కల్పన చేసిందని, రాష్ట్రాలు సైతం అనేక చట్టాలను నిబంధనలను చేసుకు న్నాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాల్టా చట్టం అందులో భాగమేనని గుర్తు చేశారు. వనరుల పరిరక్షణకు అనేక వ్యవస్థలను సైతం ప్రభుత్వం రూప కల్పన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భూగర్భ జలాల పై స్పృహ కలిగిన పౌర సమాజం చట్టాలపై అవగాహనతో క్రియాశీలక పాత్ర (Active role) పోషించాల్సిన అవసరం ఉందన్నారు. రెండవ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల గుర్తింపు, నిర్వహణ, వర్షపాతాల విశ్లేషణ, భూగర్భ జలాల అంచనా, నాణ్యతా ప్రమాణాలు, పునఃస్థాపన, ఫ్లోరోసిస్ మరియు భూగర్భ జలాల నియంత్రణ చట్టంపై శాస్త్రవేత్తలు ప్రసంగించారు. దక్కను పీఠభూమి ప్రాంతంలో ప్రధాన భాగమైన తెలం గాణ రాష్ట్రంలో సహజ సిద్ధమైన సవాళ్లతో పాటు మహానగరం హైదరాబాద్ వంటి జనసాంద్రత కలిగిన నగరాలు సహజ వనరులపై ఒత్తిడిని పెంచుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
వర్షపాత సరలిలో (Rainfall is okay)సైతం తెలంగాణ వ్యాప్తంగా భిన్న పరిస్థితులు ఉన్నట్టు తెలిపారు. నల్లగొండ జిల్లాలో వర్షపాత నమో దుకు అనేక కేంద్రాలు, భూగర్భ జలాల పరిశీలనకు బోర్ వెల్ మరియు డిగ్ వెల్స్ ఏర్పాటును. అనంతరం భూగర్భ జలాల పరిశీ లనకు అంచనాకు శాస్త్రీయ పద్ధతులను వివరించారు. ఎలక్ట్రో రెసిస్టివిటీ సోనోగ్రఫీ (Electroresistivity sonography) వంటి పద్ధతుల ను విశ్వాసంలోకి తీసుకోవాలని, తగు జాగ్రత్తలతో భూగర్భ జలాల అంచనా క్రమాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జియాలజీ విభాగపు ప్రతినిధులు మాట్లాడుతూ రేపు విద్యార్థులతో క్షేత్రస్థాయిలో భూగర్భ జలాల పరిశీలన అంచనా ప్రయోగాలను చేయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు విట్టల, సుధీర్ కుమార్, యాదయ్య, రాణి మొహంతా, రేష్మ, రాఘవేంద్ర, గౌతమ్, జియాలజీ విభాగం అధ్యాపకులు మధుసూదన్ రెడ్డి, ఆంజనేయులు, మచ్చేందర్, సుధాకర్, వెంకటేష్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.