Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

G. Venkat Reddy : రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ సమస్య లను వెంటనే పరిష్కరించాలి

G. Venkat Reddy : ప్రజా దీవెన నల్లగొండ టౌన్ : రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ సమస్య లను వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లాఅధ్యక్షుడు జి.వెంకట్‌ రెడ్డి అన్నారు. నల్లగొండలో శనివా రం పెన్షనర్స్‌ భవన్లో జరిగిన మండ ల శాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఆర్‌లు, నగదు రహిత వైద్యం, పిఆర్సి అమలు, ఇతర అపరిష్క్రత సమస్యలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం 45 మంది పెన్షనర్ల జన్మదినం సందర్భంగా వారితో కేక్‌ కట్‌ చేయించిన అనంతరం వారిని సన్మానించి బహుమతులు అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు గజవెల్లి సత్యం, యాదవాసుదేవ్, జెల్లా శ్రీశైలం, మోహన్‌రావు, రంగయ్య, జి సుధాకర్, శేషారెడ్డి ,జెల్లా పుల్లయ్య, కేశవాచారి, ఆంజనేయులు, రామలింగం, ముత్యాల కష్ణయ్య, ఎం కేశవాచారి, పి. రమేష్, రవిప్రసాద్‌ రావు, , బాలరాజు, బిక్షం , ఆజాంఅలి తదితరులు పాల్గొన్నారు.