Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gandhi Global Family Health Conference:సకల ఔషధ నిధి ప్రకృతి

–సర్వ రోగాలకు ఆయుర్వేదంతో చికిత్స సాధ్యo
–సమాజంలో ప్రజలను చైతన్యవం తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రిపై ఉంది
–గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆరోగ్య సదస్సులో డా రామచందర్ రావు, డాక్టర్ పద్మ

Gandhi Global Family Health Conference:ప్రజా దీవెన, నల్లగొండ: సకల ఔషధాల నిధి ప్రకృతి అని. దాన్ని పరిరక్షించుకుని సహజసిద్ధమైన ఆయుర్వేద ఔషధాలను (Ayurvedic medicines) ఉపయోగించడంతో ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను సైతం న్యాయం చేయవచ్చని సిద్ధార్థ యోగ విద్యాలయం, ప్రకృతి వైద్యు లు డాక్టర్ కే వై రామచం ద్రరావు తెలిపారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ – సిద్ధార్థ యోగ విద్యా నిలయం సంయుక్తంగా నల్గొండ లోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ప్రకృతి జీవన విజ్ఞానం – ఆరోగ్య సదస్సు నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ (Global Family Chairman)గున్న రాజేందర్ రెడ్డి, ప్రము ఖులతో కలిసి ప్రారంభించా రు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి పై అవగాహన ఉంటే చిన్న చిన్న రోగాలను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీర్ఘకాలిక స్వల్ప కాలిక సమస్యలను ప్రకృతిలో లభించే వివిధ ఫలాలు, గింజలు, ఆకులను ఉపయోగించుకొని సైతం దూరం చేసుకోవచ్చన్నారు. నేటి ఆధునిక జీవన విధానంలో ఆహార నియమాలు పైన అవగాహన లేకపోవడంతో ఒత్తిడికి గురి అవుతూ అనేక రకాల సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే యోగ మెడిటేషన్ (Yoga meditation)తో పాటు ఆరోగ్య నియమాలను పాటిస్తూ సహజసిద్ధమైన జొన్నలు రాగులు, మినుములు ఇలాంటి మిల్లెట్స్ ను ఆహారంగా రోజువారిగా తీసుకుంటున్నంతో ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్నారు. ఆధునిక విజ్ఞానం పేరుతో 80% ప్రజలు లక్షలు ఖర్చుపెట్టి పేదరికంలోనికి నిట్టపడుతున్నారని అన్నారు. వీటిపై చైతన్యం చేసేందుకే గత కొన్ని దశాబ్దాలుగా సిద్ధార్థ యోగ విద్యాలయం రామచంద్ర ప్రకృతి ఆశ్రమాల ద్వారా లక్షల మందికి పైగా నేచురల్ లైఫ్ సైన్స్ పై అవగాహన కల్పిస్తూ బిపి షుగర్ థైరాయిడ్ పిసిఒడి అధిక బరువు కిడ్నీ గౌట్ మానసిక రోగాలు యాసిడిటీ గ్యాస్ట్రిక్ మలబద్దకం ఇమ్యూనిటీ తగ్గిపోవడం గుండె జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్ సోరియాసిస్ తల తిరుగుడు వంటి వ్యాధులను ఆయుర్వేద చికిత్స ద్వారా నయం చేశామన్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులుడాక్టర్ N.G. పద్మ (N.G. Padma) మాట్లాడుతూ రోజువారిగా తీసుకోవలసిన ఆహారము, నియమాలను ప్రాక్టికల్ గా ఉదాహరణలతో వివరించి, సిద్ధార్థ యోగ విద్యాలయం డైట్ షీట్ ను దైనందిక జీవితంలో అలవాటు చేసుకోవాలని స్ఫూర్తినింపారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల (Gandhi Global Family Company)చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ద్వారా ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య చేస్తున్నామన్నారు. రామచంద్ర ప్రకృతి ఆశ్రమంలో ఎంతోమంది చికిత్స తీసుకొని ఆనందంగా ఉన్నారని తెలిపారు. మానవ జీవన విధానం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలంటే అది కేవలం ఆరోగ్యంగా ఉండటంతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలను పాటించి సహరిసిద్దమైనటువంటి నేచురల్ లైఫ్ సైన్స్ ను ప్రకృతి జీవన విధానాన్ని ఔషధాలను ఉపయోగించాలన్నారు.

ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లెన్సర్ (Youtube influencer)ఏచూరి శైలజ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ప్రకృతి చికిత్స విధానం-ఆరోగ్య సదస్సుపై సిద్ధార్థ యోగ విద్యాలయం డాక్టర్స్ రామచంద్రరావు పద్మలతో ఇంత పెద్ద ఆరోగ్యసదస్సును నిర్వహించడం ఎంతో పెద్ద బృహత్ కార్యమని తెలియజేస్తూ ఇది నలగొండ వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని దీనికి కృషి చేసిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలకు అభినందనలు తెలిపారు.

నల్గొండ పట్టణం తో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారుగా సదస్సుకు 1200 పైగా ప్రముఖులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావేత్తలు, విద్యార్థులు, క్రీడాకారులు, యువతి,యువకులు హాజరైనారు. వీరు సైతం మాట్లాడుతూ ఇలాంటి సదస్సును నల్గొండలో నిర్వహించి ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమని సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరు అభినందనలు తెలిపారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యానాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డాక్టర్స్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు, పాముల అశోక్, లోకనబోయిన రమణ,గిరిధర్ రావు, నాగమణి రెడ్డి, ముక్కామల నరసింహ, ఎండి అజిజ్, దశరథ గౌడ్, పజూరి రవీందర్ రెడ్డి, ప్రముఖ పర్యావరణవేత మిట్టపల్లి సురేష్ గుప్తా, గౌడ్,ట్రస్మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోడి శ్రీనివాస్ జి వి రావు తోపాటు తదితరులు పాల్గొన్నారు.