Goda Devi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక సీతారామ చంద్రస్వామి ఆలయంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో 18వ పాశురం సందర్భంగా గోదా అమ్మవారికి సారే(పట్టు వస్త్రాలు , పండ్లు పూలు పసుపు కుంకుమ పిండివంటలు గాజులు) అమ్మవారికి మేళ తాళాలతో, భక్తుల హర్ష జనాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సమర్పిం చారు. అనంతరం భక్తులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రవచకులు శ్రీ భాష్యం జగన్నాథచార్యులు, ఈవో జయరామయ్య,కౌన్సిలర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి వికాస తరంగిణి అధ్యక్షురాలు చొక్కారపు మాధవి, కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, మహిళా ఆరోగ్య వికాస్ కోఆర్డినేటర్ యర్రమద సుజాత, శిరీష్ కుమార్, మంతిన మాధవి, ఏచూరి రమాదేవి, నూకల సంధ్యారాణి, అక్కినపల్లి పద్మ, భువనగిరి భారతి, సరస్వతి, అర్చకులు, స్థానాచార్యులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.