ప్రజా దీవెన, నల్గొండ టౌన్: బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి గారు పాల్గొని రైతు భరోసాను సంక్రాంతి పండుగ కంటే ముందే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..సంక్రాంతి కంటే ముందే రైతు భరోసాను విడుదల చేసినట్లయితే రైతులకు పంట పెట్టుబడికి సాయం అందుతాయని, అందువల్ల రైతుల సాగుకు ఎలాంటి ఇబ్బంది కలగదని ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడదని ఇట్టి విషయాన్ని ప్రభుత్వం గ్రహించి సంక్రాంతి పండుగ కంటే ముందే రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే విధంగా రైతు భరోసాను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గోలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు .ఈ సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు కర్నాటి వెంకటేశం, జిల్లా సభ్యత్వ సహా ప్రముఖ్ లకడాపురం వెంకన్న, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్ పాల్గొన్నారు.