Gopalamitra Association:కమలధలం లో జోష్ నింపిన జగత్ ప్రకాష్ నడ్డా
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో సోమవారం నిర్వ హించిన బీజేపీ జనసభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
400 సీట్లతో బిజెపి అధికారంలోకి
మోడీ ప్రధాని అయ్యాక ఉగ్రదాడులు జరగలేదు
నోట్ల రద్దు ద్వారా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు
ఇతర దేశస్తులు భారత్ వైపు చూడాలంటే జంకుతున్నారు
సైదిరెడ్డి గెలుపుతోనే నల్లగొండ అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య
రిజర్వేషన్ల రద్దు ప్రసక్తే ఉండదని స్పష్ఠికరణ
జనసభకు భారీగా తరలివచ్చిన కాషాయ పార్టీ శ్రేణులు
ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్(Mekala Abhinav) అవుట్ డోర్ స్టేడియంలో సోమవారం నిర్వ హించిన బీజేపీ జనసభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ప్రసంగం కార్యకర్త లను ఆకట్టుకుంది. రేణుకా ఎల్లమ్మ దేవి అంటూ జేపీ నడ్డా తన ప్రసంగం మొదలు పెట్టడంతో యువత కేరింతలు కొట్టారు. జేపీ నడ్డా కమలదళంలో జోష్ నింపారు.
సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ సారధ్యంలో మూడోసారి దేశంలో 400 సీట్లతో అధికారం చేపట్టబోతున్నామని అన్నారు. నరేంద్ర మోడీ దేశ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఉగ్రవాద దాడులు జరగలేదని తెలిపారు. నోట్ల రద్దు తో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ను దెబ్బ తీశామని, మోడీ(Modi) భయంతో ఇతర దేశస్తులు భారతదేశం వైపు చూడాలంటే జంకుతున్నారని చెప్పారు. కెసిఆర్ గతంలో భయంకరమైన హిందువునని చెప్పాడు. మరి అప్పుడు మత రాజకీయాలు గుర్తుకు రాలేదా కేసీఆర్ అని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరం నిర్మించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
తెలంగాణలో(Telangana) మోడీ పైసలు, మోడీ గ్యాస్, మోడీ ఉచిత వ్యాక్సిన్, మోడీ బీమా, మన ఆర్థిక వ్యవస్థ ఇలా అన్ని రంగాలలో దేశాన్ని మూడో ర్యాంకుకు తెచ్చిన ఘనత నరేంద్ర మోడీదేనని పేర్కొన్నారు. వందల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించింది బిజెపి(BJP) ప్రభుత్వమేనన్నారు. దేశంలో ధర్మం వెళ్లి విరియాలంటే మరోసారి మోడీ ప్రభుత్వ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నలగొండ ప్రజలారా ఒక్కసారి సైదిరెడ్డిని పార్లమెంటుకు పంపించండి, అభివృద్ధిని పెంచుకోండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరిగింది కానీ, అభివృద్ధి పెరగలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు రద్దవటం ఖాయమన్నారు.
రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, నరేంద్ర మోడీ ఈ దేశానికి అవసరం. మళ్లీ తెచ్చుకుందాం అన్నారు.రేవంత్ రెడ్డి ఇష్ట రీతిగా మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చింది అంటున్నాడు.మోడీ తాకితే భస్మం అవుతారని హెచ్చరించారు.నల్లగొండ, భువనగిరి భాజపా అభ్యర్థులను పార్లమెంటుకు పంపాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీ హమాలు కాలేదనీ పేర్కొన్నారు.పెన్షన్లు రాలేదు, రైతు భరోసా రాలేదు, రేషన్ కార్డు రాలేదు రుణమాఫీ కాలేదనీ చెప్పారు.
బిజెపికి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.రిజర్వేషన్ల రద్దు అనే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.కాంగ్రెస్, సోనియా, రాహుల్, ప్రియాంక మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానం పూడి సైదిరెడ్డి గెలుపుతోనే నల్లగొండ అభివృద్ధి సాధ్యమన్నారు. ఈనెల 13 న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) కమలం పువ్వుకు ఓట్లేసి యువకుడైన సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మరో ఆరు నెలలు, లేదా సంవత్సరంలోగా ఈ కాం గ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
తొందర లోనే బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలే ఉంటారని తెలిపారు. నల్లగొండ సమస్యలపై దుమ్ముంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నానని, ఎక్కడికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. నల్లగొండ(Nalgonda) ఒకప్పుడు కమ్యూనిస్టు, కాంగ్రెస్ అడ్డా అని.. నేడు బీజేపీ గడ్డ అని, కాషాయం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ యువతకు 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ తీసు కొస్తానని తెలిపారు.
రేవంత్ రెడ్డి(Revanth Reddy) గాడిద గుడ్డు చూపి స్తున్నారని.. ఆయన ఇచ్చిన హామీలు మహిళలకు రూ.2500, యువతుల పెళ్లిల్లకు తులం బంగారం, రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రూ.12 వేలు, ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత రెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమ లు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. జిల్లాలో వారసత్వ రాజకీయాలను తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటే శ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, చాడ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, చింతా సాంబమూర్తి, గోలి మధుసూదన్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పిల్లి రామరాజుయాదవ్, జుట్టుకొండ సత్య నారాయణ, కంకణాల నివేధిత, పోతెపాక సాంబయ్య, లాలూనాయక్, సాధినేని శ్రీనివాసరావు, పెరిక మునికుమార్, గడ్డంమహేష్ తదితరులు పాల్గొన్నారు.
Gopalamitra Association MLA Vemula Veeresham