Government schemes :పథకాల అమలు తీరు భేష్
నల్లగొండ జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియ ట్ శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికా రులు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ(Nalgonda) జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భాగం గా హైదరా బాదులోని డాక్టర్ మరి చెన్నారెడ్డి(Chenna Reddy) మానవన వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ నిమిత్తం వచ్చిన ఈ బృందం ఈనెల 20 నుండి 24 వరకు నల్గొండ జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాలలో పర్యటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలను అధ్యయనం చేశారు.
కాగా శుక్రవారం ఈ బృందం జిల్లా కలెక్టర్(Collector)కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర తో సమావేశమై వారు అధ్యయనం చేసిన ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను వెలుబుచ్చారు. ఈ సందర్భంగా పలువురు శిక్షణ అధికారులు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో అమలు చేస్తున్న మిషన్ భగీరథ, అంగన్వాడి(Anganwadi)కేంద్రాల నిర్వహణ, వైద్య సదుపాయాలు, గ్రామాలలో షెగ్రిగేషన్ షెడ్లు, స్మశాన వాటికలు, నర్సరీల నిర్వహణ, వరి ధాన్యం సేకరణ తదితర పథకాలు బాగు న్నాయని తెలిపారు. డిఆర్డిఓ నాగి రెడ్డి, శిక్షణ నిర్వాహకులు వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.
Government schemes are good implemented