Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BC study circle: బీసీ స్టడీ సర్కిల్ పై పట్టింపేది..?

ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఇష్టారితి వల్ల నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆగమ్య గోచరంగా తయారైందని, జిల్లాలోని విద్యార్థులు సరైన కోచింగ్ అందక తీవ్రంగా నష్టపోతున్నారని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి ఆరోపించారు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్న విద్యార్థులు

డైరెక్టర్ నిర్వాకం వల్లే డీఎస్సీ కోచింగ్ లేకుండా పోయింది

ఇష్ట రీతిగా వ్యవహరిస్తున్న డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలి

 

జిల్లా కలెక్టర్ విద్యార్థులకు న్యాయం చేయాలి

నిరుద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పల్వాయి రవి

ప్రజా దీవెన నల్లగొండ:  ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఇష్టారితి వల్ల నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆగమ్య గోచరంగా తయారైందని, జిల్లాలోని విద్యార్థులు సరైన కోచింగ్ అందక తీవ్రంగా నష్టపోతున్నారని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి ఆరోపించారు. శనివారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో స్టడీ సెంటర్ లోని విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1 వంద రోజులు, గ్రూప్ 2, వంద రోజులు ప్రోగ్రాం ఉంటుంది. కానీ బీసీ స్టడీ సర్కిల్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి వంద రోజుల్లో కోచింగ్ ను పూర్తి చేశారని ఆరోపించారు. వంద రోజులలో సరైన క్లాసులు నిర్వహించలేదని, దీనితో సిలబస్ పూర్తికాక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు.

గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసులు వేరువేరుగా నిర్వహించాలి. కానీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాత్రం ఇష్టారాజ్యంగా స్టడీ సర్కిల్ ను నడుపుతూ తనకు కావలసినప్పుడల్లా సెలవులు పెడుతూ స్టడీ సర్కిల్ నిర్వహణను గాలికి వదిలేశారాని ఆరోపించారు. సీనియర్, సబ్జెక్ట్ నైపుణ్యం గల ఫ్యాకల్టీ ని తొలగించి ప్రభుత్వ ఫ్యాకల్టీతో కోచింగ్ ఇప్పిస్తూ క్లాసులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కమిషన్ ఇచ్చిన వారికి ఎక్కువ క్లాసులు, మిగతా అధ్యాపకులకు తక్కువ క్లాసులు ఇచ్చి కోచింగ్ ని పూర్తి చేస్తున్నాడని పేర్కొన్నారు.

ఎవరైనా ప్రశ్నిస్తే వారిని, తొలగించడం వారి స్థానంలో లో వేరే వారిని నియమించుకోవడం జరుగుతుందని తెలిపారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ నిర్వాకం వల్ల డీఎస్సీ కోచింగ్ నల్లగొండలో ఇవ్వడం లేదని, హైదరాబాదులో డిఎస్సి కోచింగ్ ఇవ్వడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన చెందారు. బీసీ విద్యార్థుల సమస్యల పైన ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యక చొరవ తీసుకొని స్టడీ సర్కిల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. కోచింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ ఇవ్వాలని, అలాగే స్కాలర్షిప్ కూడా 2500 ఇవ్వాలని కోరారు. కలెక్టర్ ను కలిసిన వారి లో కే. మహేష్ గౌడ్, సాయి, నాగరాజు, యాదగిరి, యాదయ్య, పుష్ప, రజిత, లలిత, తదితరులు పాల్గొన్నారు.

Govt neglect BC study circles