MLC by election: పట్టా భద్రులు @ 72.37 శాతం
వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు ఈనెల 27న నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు
కొన్ని జిల్లాల లో సాయంత్రం 7 గంటల వరకు కొనసాగిన పోలింగ్
ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు ఈనెల 27న నిర్వహించిన పోలింగ్(Polling) ప్రశాంతంగా ముగిసింది.పోలింగ్ అనంతరం అన్ని జిల్లాల నుండి పోలైన బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య నల్గొండ(Nalgonda) సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న వ్యవసాయ గోడౌన్ లోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు.నల్గొండ, సూర్యాపేట ,యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్ ములుగు, మహబూబాబాద్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం ,భద్రాద్రి కొత్తగూడెం 12 జిల్లాలలో ఉన్న నాలుగు లక్షల 63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు 605 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసారు.
ఎం ఎల్ సి(MLC) ఎన్నికల పోలింగ్ అన్ని 12 జిల్లాల పరిధి లో 27వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఎలాంటి అంతరాయం లేకుండా శాంతియుత వాతావరణం జరిగింది.కొన్ని జిల్లాల లో సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 72.44 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 78.59 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 67.62 పోలింగ్ శాతం నమోదయ్యింది.
ఎన్నికల సంఘం(Election Commission) ఆదేశాల మేరకు అన్ని 12 జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించడం జరిగింది.ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడంలో ఓటర్లు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా, అలాగే చెల్లని ఓట్లను(Votes) నివారించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసే సమయంలో ఓటర్లు చేయవలసిన పనులు, చేయకూడని పనులపై ఫ్లెక్సీలను ప్రదర్శించడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో యువత ప్రత్యేకించి మహిళలు పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడి ఓటు వేయడం విశేషం.
అన్ని 12 జిల్లాల జిల్లా కలెక్టర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు గా వ్యవహరించిన అడిషనల్ కలెక్టర్లు, పోలీస్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు,ఎం ఎల్ సి ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సందర్బంగా అన్ని 12 జిల్లాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను విధించారు. అంతేకాకుండా
పోలింగ్ సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, ఏ చిన్న సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు.అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్(Help desk) లతోపాటు, ప్రథమ చికిత్స సౌకర్యాలను ఏర్పాటు చేశారు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తో పాటు, వరంగల్, ఖమ్మం,నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ 12 జిల్లాలలో నిర్వహించిన పోలింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి 12 జిల్లాలలో ఏర్పాటుచేసిన 605 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ను ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, పట్టభద్రులైన ఓటర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు,12 జిల్లాల సిబ్బంది అందరికీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కృతజ్ఞతలు తెలిపినట్లు,
వరంగల్,ఖమ్మం,నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన దాసరి(Harichandana Dasari)
పేర్కొన్నారు.
జిల్లాల వారీగా తుది పోలింగ్ శాతం వివరాలు….
యాదాద్రి భువనగిరి జిల్లా 78.59 శాతం జనగాం 76.34, సిద్దిపేట 76.13, ములుగు 74.58, జయశంకర్ భూపాలపల్లి 73.62, నల్గొండ 73.29, సూర్యాపేట 73.15, వరంగల్ 72.68 ,హనుమకొండ 72.45, మహబూబాబాద్ 72.15, భద్రాద్రి కొత్తగూడెం 69.95, ఖమ్మం 67.62 నమోదయ్యింది.
graduate mlc election polling peacefull