Dasari hari chandana: ఉప ఎన్నికకు ఆన్ని ఏర్పాట్లు పూర్తి
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు అవ సరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని శాసన మం డలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు తెలియజేశారు.
ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు అవ సరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని శాసన మం డలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన(Dasari Harichandana) రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు తెలియజేశారు.బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఏర్పాట్లపై నల్గొండ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి దాసరి హరిచం దన తోపాటు, ఉప ఎన్నికలు జరిగే 12 జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ ఆద నపు కలెక్టర్లు,ఏ ఆర్ఓలతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శాసనమండలి పట్టభద్రుల ఉపఎ న్నికకు సంబంధించి చేసిన ఏర్పాట్ల పై సీఈవో(CEO) అడిగగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పరిధిలో 600 పోలింగ్ కేంద్రాలు, మరో 5 ఆక్సిలరి పోలింగ్ కేంద్రాలు ఉన్నా యని, అన్ని పోలింగ్(Polling) కేంద్రాలలో అవసరమైన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 5 లక్షల బ్యాలెట్ పేపర్లు రాష్ట్రస్థాయి నుండి రావడం జరిగిం దని ,వాటన్నిటిని సంబంధిత జిల్లాలకు పంపించామని, పోలింగ్ కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సైతం సిద్ధంగా ఉన్నాయని, ఎలాం టి ఇబ్బంది లేదని తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బం దిని కేటాయించడం జరిగిందని, వీరందరికీ మొదటి విడత శిక్షణ కార్యక్రమాలను సైతం పూర్తి చేసి నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులకు ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేస్తు న్నామని, 96 టేబుల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడు తూ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికను ఆషామాసిగా తీసుకోవద్దని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులకు ఓటర్(Voter)ఫెసిలిటేషన్ కేంద్రాలపై పూర్తిస్థాయిలో అవ గాహన కల్పించాలని, ఎన్నికలలో ఓటు(Vote) వేసేందుకు ఎన్నికల సంఘం సరఫరా చేసిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్,ఇండెలిబుల్ ఇంకులు మాత్ర మే వినియోగించాలని తెలిపారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగిసినందున ఎంఎల్ సి ఎన్ని కలలో ఓటరు ఎడమ చేయి మధ్య వేలుకు ఇండెలిబుల్ ఇంక్ మార్కు చేయాలని, ఎన్నికలలో పోటీ చేస్తు న్న అభ్యర్థుల జాబితాను ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బయట ప్రద ర్శించాలని, అదేవిధంగా ఓటర్లు ఓటు ఎలా వేయాలో ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయా లని సూచించారు.
అంతకుముందు నల్గొండ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన జిల్లాల అదనపు కలె క్టర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికా రులతో ఎంఎల్ సి ఎన్నికల పై సూచనలు చేశారు. ముఖ్యంగా పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లను రిసెప్షన్ కేంద్రానికి తీసు కురావడంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన టార్పా లిన్లతో క్లోస్డ్ కంటైనర్ వాహనాలలో తేవాలని, ఈనెల 24న ఇతర పోలిం గ్ సిబ్బంది మెటీరియల్ వస్తుందని దానిని తీసుకోవా లని,తక్షణమే పోలింగ్ సిబ్బంది ఉత్తర్వులను పంపించాలని, ఈ నెల 24న పోలింగ్ సిబ్బంది రండమైజేషన్ నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు జిల్లా ఎస్పీ చందన దీప్తి ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ నల్గొండ, మిర్యాలగూడ ఆర్డీవోలు, ఏఆర్వోలు రవికుమార్, శ్రీనివాసరావు, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ తదితరులు జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాగా, రాష్ట్రస్థాయి నుండి ఆదనపు సీఈవోలు సర్ఫరాజ్ , లోకేష్ కుమార్, డిప్యూటీ సి ఈవో ఎల్ సత్యవాణి తదితరులు హాజరయ్యారు.
graduate mlc election polling work completed