Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC By elections: వ్యవస్థమార్పులో పట్టభద్రుల పాత్ర కీలకం

సమాజ వ్యవస్థలో మార్పు తీసు కరావడానికి పట్టభద్రులు ప్రధాన పాత్రదారులు కావాలని, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మీయొ క్క సమస్యలపై అవగాహన కలిగి యుండి నిరంతరం పోరాడే అభ్యర్థి కి మీ మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటు

నల్లగొండ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సమాజ వ్యవస్థలో మార్పు తీసు కరావడానికి పట్టభద్రులు ప్రధాన పాత్రదారులు కావాలని, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మీయొ క్క సమస్యలపై అవగాహన కలిగి యుండి నిరంతరం పోరాడే అభ్యర్థి కి మీ మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటు వేసి ప్రజలందరికీ మీరు ఆద ర్శంగా నిలవాలని నల్గొండ(Nalgonda) పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి గౌడ్(Palakuri Ravi Goud)కోరారు.

సాధారణ ఎన్నికలలో(Eletions) నిరక్షరా స్యులైన కొంత మంది ఓటర్లు, అలాగే ఓటు(Vote) విలువ తెలియని వాళ్ళు ఆయా ఎన్నికల సమయం లో డబ్బులకు లేదా ఇతర ప్రలోభా లకు లొంగి తమ ఓటును అసమర్థు లకు వేస్తున్న విషయం మన అంద రం గమనిస్తూనే ఉన్నామని, అలాం టి వాళ్ళలో చైతన్యం రావాలి అంటే చదువుకొని విజ్ఞానవంతులైన మీరు మీ యొక్క ఓటును నిష్పక్ష పాతంగా వేసి మీ విజ్ఞతను నిరూ పించుకోవాలని కోరారు. కొన్ని రాజ కీయ పార్టీల అభ్యర్థులు అధికార, ధన బలంతో గెలుపు తమదే అని విర్రవీగుతున్న వారికి మీ ఓటుతో దిమ్మ తిరిగేలా సమాధానం ఇవ్వా లని మీ అందరినీ మరొక్కసారి కోరుతున్నానన్నారు.

graduates role crucial in system change