Paddy purchase: ధాన్యం కొనుగోలు ను త్వరగా పూర్తి చేయాలి
ధాన్యం కనుగొలును వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. వెంకటేశ్వర్లు ఆదేశించారు.
జిల్లా లో 370 సెంటర్ల ద్వారా 143846 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
99.76 కోట్లు రైతు ఖాతాలో జమ
-డీఎస్ఓ వెంకటేశ్వర్లు
ప్రజా దీవెన నల్గొండ: ధాన్యం కనుగొలును(Paddy purchase) వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. వెంకటేశ్వర్లు ఆదేశించారు.గురువారం డిఎం నాగేశ్వరరావు తో కలిసి హైదరాబాద్ రోడ్ లోని అర్జెల బావి, పానగల్ పిఏఎస్ఎస్ కొనుగోలు సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు(Farmers) ఎలాంటి ఇబ్బందులు రాకుండా కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఇప్పటివరకు కేంద్రానికి 810 మంది రైతులు రాగా అందులో 537 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
రోజుకు 12 నుంచి 14 లారీల ద్వారా ట్యాగ్ చేయబడ్డ ధాన్యన్ని మిల్లలకు రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు.రైతులు(Farmers) సెంటర్ వద్దకు రాగానే పేరు నమోదు చేసుకొని సీనియార్టీ ప్రకారంగా ధాన్యం కొనుగోలు చేయాలని, టార్ఫాలీన్లు అందుబాటులో ఉంచుకోని వర్షాలు కురిసే సమయంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కప్పి ఉంచాలన్నారు. రైతులను కూడా వర్షం వచ్చినప్పుడు ధాన్యాన్ని భద్రపరచుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో 370 సెంటర్ల ద్వారా వరి ధాన్యాన్ని(Grain purchase) కొనుగోలు చేయటం జరుగుతుందని నేటి వరకు 20913 మంది రైతుల వద్ద నుంచి 143846 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు రవాణా చేయటం జరిగిందని,99 కోట్ల 76 లక్షల డబ్బులను రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగినట్లు వివరించారు.
Grain purchase completed quickly