Group-1 Preliminary Exam: పగడ్బంధిగా గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష
జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీ క్షలను ఇలాంటి పొరపాటు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు.
చీఫ్ సూపర్డెంట్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ లకు శిక్షణా కార్యక్ర మంలో నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీ క్షలను ఇలాంటి పొరపాటు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్(SP Ramulu Naik)తెలిపారు.జూన్ 9 న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వ హించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు జిల్లా పోలీసు కార్యా లయంలో నల్లగొండ జిల్లా ఎస్పి చందనా దీప్తి(SP Chandana Deepti)ఐపీఎస్ ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పి రాములు నాయక్ ఆధ్వ ర్యంలో చీఫ్ సూపర్డెంట్లకు మరియు బయో మెట్రిక్ ఇన్విజిలేటర్ లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లా డుతూ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు నల్గొండ జిల్లాలో మొ త్తం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,జిల్లా నుండి 16899 మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలను రాయను న్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు,(Electronic goods)క్యాలిక్యులేటర్లు, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్ లు, బ్లూటూత్ డివైస్లు, ఎలక్ట్రానిక్ వాచ్ లు, మ్యాథ మెటికల్ టేబుల్స్ ,లాక్ బుక్కులు, లాగ్ టేబుల్స్, వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్ లు, రైటింగ్ ప్యాడ్, అలాగే బంగారు ఆభరణాలు, ఇతర గాడ్జట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, రికా ర్డింగ్ వస్తువులు అనుమ తించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. పరీక్ష పూర్తయ్యేంతవరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళకూడదని, పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఓఎం ఆర్ ఆన్సర్ సీట్లను అప్పగించి వెళ్ళాలని తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ఉదయం 9:30 గంటల నుండి అభ్యర్థుల బయోమెట్రిక్(Biometric)విధానం ప్రారంభమవుతుందని, అందువల్ల తప్పనిసరిగా బయోమెట్రిక్ తీసుకోవాలని, బయోమెట్రిక్ వేయని, ఓఎంఆర్ ఆన్సర్ సీటును అప్పగించిన అభ్యర్థుల ఓఎంఆర్(OMR) ల ఆన్సర్ మూల్యాంకనం చేయడం జరగదని అన్నారు. అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు మెహేంది ధరించవద్దని, అలాగే తాత్కాలిక టాటూస్, అభ్యంతరకరమైన మెటీరియల్ ను ధరించడం వంటివి చేయకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్బి డీయస్పి రమేష్, రిజనల్ కో ఆర్డినేటర్ ఉపేందర్ చీప్ సూపర్డెంట్లు, బయో మెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Group-1 Preliminary Examination carefully