–ఈనెల 28న నల్లగొండలో కాంగ్రెస్ జోడో ర్యాలీ
–ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరణలో కాంగ్రెస్ పార్టీ నేతలు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రె స్ పార్టీ 139 వ ఆవిర్భావ దినోత్స వాన్ని ఈనెల 28న ఘనంగా నిర్వ హించడం జరుగుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తెలిపారు.గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 139 వ వ్యవస్థాపనోత్సవానికి సంబంధించి పోస్టర్ ను నల్లగొం డ,తిప్పర్తి,కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగూరి లక్ష్మ య్య, జూకూరి రమేష్, గడ్డం అను ఫ్ రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 28న మధ్యాహ్నం 3 గంటలకు ఎన్జీ కళాశాల నుంచి శివాజీ నగర్, రామగిరి, బస్టాండ్ మీదుగా క్లాక్ టవర్ వరకు కాంగ్రెస్ జోడో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు క్లాక్ టవర్ సెంటర్ లో సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతతత్వంతో ప్రజలను రెచ్చగొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ దేశానికి చేసిన సేవలను వివరించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ జోడో ర్యాలీ, బహిరంగ సభకు నల్గొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన కాంగ్రెస్, NSUI, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కిన్నెర అంజి, జూలకంటి సైదిరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ బాబా, యువజన కాంగ్రెస్ నలగొండ మండల అధ్యక్షుడు కె.వి.ఆర్ సతీష్, కనగల్ మండల అధ్యక్షుడు కట్టబోయిన పవన్ కళ్యాణ్, కంచర్ల ఆనంద్ రెడ్డి, ఎండి అజ్జు, బొడ్డుపల్లి రాజేష్, బైరు ప్రసాద్, ఆవుల నందిని తదితరులు పాల్గొన్నారు