–నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
Gummula Mohan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఉర్దూ మీడియం పాఠశాల (Urdu Medium School) విద్యార్థినీలు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (Gummula Mohan Reddy) అన్నారు.నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కలో గల బహదూర్ ఖాన్ కమ్యూనిటీ హాల్లో అఖమట్ ఖానా కమిటీ ఆధ్వర్యం లో సుమారు 170 మంది ఉర్దూ మీడియం స్కూల్ నిరుపేద విద్యార్థులకు ఆదివారం ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ (Distribution of note books) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతి థిగా పాల్గొని విద్యార్థినీలకు నోటుబుక్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహదూర్ ఖాన్ అఖమాట్ ఖానా కమిటీ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు చేయూత అందించినట్టు అవుతుందని అన్నారు.
కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ట్రస్టు (Komatireddy Prateek Reddy Trust)ద్వారా బహదూర్ ఖాన్ ఆధ్వర్యంలో రాబోవు రోజుల్లో కులమతాలకు అతీతంగా తక్కువ ఫీజులతో బహదూర్ ఖాన్ స్కూల్ స్థాపించడానికి మంత్రి కోమటిరెడ్డి గారితో చర్చించి ప్రభుత్వ స్థలం వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఎంబిబిఎస్,ఐఐటి గవర్నమెంట్ సీటు పొందిన విద్యార్థులకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ (Komatireddy Prateek Reddy Trust)ద్వారా పూర్తి ఫీజులు (fees) చెల్లించే విధంగా సహకరిస్తానని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని, రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బహదూర్ఖాన్ కమిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఝాహేద్ హుస్సేన్, సెక్రెటరీ డాక్టర్ ముంతాజ్ ఖురేషి, ట్రెజరర్ మొహమ్మద్ కలీం, జాయింట్ సెక్రటరీ షఫి నవాస్ ఖాన్, మాజీ ప్రెసిడెంట్ షాహిద్ అహ్మద్, ఈసి మెంబర్ మౌజామ్ హుస్సేన్, ఎంఎం వాసిక్ ,నుసురత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.