Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gummula Mohan Reddy: నాయకునిగా ఎదగడానికి యువజన కాంగ్రెస్ పునాది

–నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షు డు గుమ్ముల మోహన్ రెడ్డి
— మంత్రి క్యాంప్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Gummula Mohan Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదగడానికి యువజన కాంగ్రెస్ పునాది లాంటిదని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (Gummula Mohan Reddy) అన్నారు.శుక్రవారం నల్గొండ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి యువజన కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో (Congress party)నాయకునిగా ఎదగడానికి యువజన కాంగ్రెస్ పునాది లాంటిదని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను పార్టీకి అందిస్తుందన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలంతా మొదట్లో యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వారేనని అన్నారు.

యువజన కాంగ్రెస్ (Congress party)లో కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన యువజన కాంగ్రెస్లో పని చేయడం గొప్ప విషయం అన్నారు. తాను కూడా యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తినేనని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీటిని యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన వారికి అందే విధంగా చూడాలన్నారు. పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, జూలకంటి సైదిరెడ్డి, గోలి రవి, యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి కార్తీక్, పాదం అనిల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, బోరిగ రంజిత్, అజారుద్దీన్, నరేష్ పటేల్, దాసరి విజయ్, సయ్యద్ తఫ్రేజ్, దాసరి రవి తదితరులు పాల్గొన్నారు