ప్రజాదీవెన, నల్గొండ టౌన్: నాయకులుగా ఎన్నికైన వారు ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే గుర్తింపు తానంతట అదే వస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్య సంఘం నల్గొండ జిల్లా నూతన కమిటీ పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం స్థానిక బన్డారు గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ వైశ్యులు అంటే ప్రేమ జాలి గుణం కలవారిని దైవభక్తితో పాటు సహాయం చేసే గుణం ఉంటుందని దేవాలయాలకు అన్నదాన సత్రాలకు విరివిగా విరాళాలు ఇస్తూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.
నల్లగొండ పట్టణంలో ఆర్య సంఘ భవన నిర్మాణం కోసం ఆర్యవైశ్య నాయకులు అడిగిన ఎకరం స్థలాన్ని ప్రభుత్వపరంగా ఇప్పించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కాలువ సుజాత సహకారంతో ప్రభుత్వము నుండి ఇప్పించడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం కూడా పేద ఆర్యవైశ్యులను ఆదుకోవడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని దానికి నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం త్వరలో కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ ఎన్నికైన సంఘం సభ్యులు సంఘ పటిష్టతతో పాటు ఆర్యవైశ్య పేదలకు సహకార అందించడానికి పనిచేయాలన్నారు.
జిల్లాలోని అన్ని మండలాలలో కమిటీ లు. వేయాలన్నారు అలాగే పేద వైశ్యులకు ప్రభుత్వపరంగా వచ్చే అనేక పథకాలను వర్తింప చేయడానికి నాయకులు పనిచేయాలన్నారు. ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు తెలుకుంట్లచంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షునిగా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం కృషి చేస్తూ సంఘం బలోపేతానికి పనిచేస్తానని తనకు అన్ని వర్గాల నుండి సహకారం కావాలన్నారు.తనపై నమ్మముంచి తనను జిల్లేఎంనుకున్నవారికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆర్యవైశ్య పేద మహిళల ల సంక్షేమానికి అభివృద్ధికి పని చేస్తామని ప్రభుత్వపరంగా కావాల్సిన అవసరాలను తీర్చడానికి కృషి చేస్తామని అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ అందరి సహకారంతో పనిచేస్తానని అన్నారు.
తక్షణ మాజీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత, ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద ,ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్, నూతన అధ్యక్షుడు తెలుకుంట్ల చంద్రశేఖర్, కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్, అదనపు కార్యదర్శి నాల్లవెంకటేశ్వర్లు, కోశాధికారి జయిని రాములు,మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్,దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేశం,మాజీ అధ్యక్షలు వీరెల్లి కృష్ణయ్య, తేలుకుంట్ల జానయ్య.
కాసం శేఖర్, బండారు కుశలయ్య, రేపాల భద్రాద్రి, రాముడు, సోమ శ్రీనివాస్, సోమ దీప్తి, మురారిశెట్టి నందిని, సోమ హైమావతి మిట్టపల్లి కళావతి తేలు కుంట్ల జానయ్య పానుగంటి మల్లయ్య, తెడ్ల జవహర్ నాయకులు బుక్క ఈశ్వరయ్య, రాయపూడి భవాని, ఆర్య సంఘ నాయకులు నాంపల్లి నరసింహ, ఓరుగంటి పరమేశ, కసంశోభ,ఆర్యవైశ్య యువజన సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సహాయ కార్యదర్సులు తిరునగర్ నాగలక్ష్మి ,రాయపూడి భవాని, వీరవల్లి పద్మ వనమాహైమా అరుంధతి ,గుమ్మడి గీత యువజన విభాగం గుండా నాగరాజు, నేలన్ట్టి వెంకటరమణ కలకుంట్ల రవికుమార్ ,కొత్త మాస్ నవీన్ కుమార్ ,కమిటీ చైర్మన్ లు వీరెల్లి సతీష్ సోమ చంద్రశేఖర ర్,విధ కమిటీల చైర్మన్లు లతోపాటు వివిధ హోదాలలో ఉన్న వైశ్య నాయకులు పాల్గొన్నారు.