–కాళేశ్వరం పై పెట్టిన శ్రద్ధ కృష్ణ బేసిన్ పై పెట్టలేదు
–జిల్లా మంత్రులు కృష్ణ బేసిన్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
— శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutta Sukhender Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణలో గడిచిన 10 ఏళ్ల కాలంలో కృష్ణ బేసిన్ (Krishna Basin) పై నల్గొండ జిల్లాలో ని ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలంగాణ శాస నమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అసహనo వ్యక్తం చేశారు.
గురువారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ కార్య క్రమం నిర్వ హించారు.ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా బేసిన్ లో నల్గొండ జిల్లాకి చెందిన సాగునీటి ప్రాజెక్టు పను లను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేశారన్నారు.గోదావరి పైన ప్రాజె క్టులు త్వరగా పూర్తి చేసి, కృష్ణ బేసిన్ లో నిర్మించే ప్రాజెక్టులపై అశ్ర ద్ధ వహించారని విమర్శించారు.
గత ప్రభుత్వం కాళేశ్వరంపై (Kaleswaram)చూపిన శ్రద్ధ, కృష్ణా బేసీన్ లో నిర్మిస్తున్న ప్రా జెక్టులపై చూపలేదని ఆరోపిం చా రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరి గేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)లు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరగా పూర్తి చేసి జిల్లా ను సస్యశ్యామలం చెయ్యాలని కోరారు.
మూసి రివర్ ఫ్రంట్ ఏర్పా టు మంచి పరిణామంగా ఆయన అభివ ర్ణించారు. నాగార్జున సాగర్ డ్యాం పరిధిలో ప్రమాదానికి గురైన సుం కిశాల పథకం ప్రాజెక్టు అవసరం లేదని, సాగునీటి పధకంమైన సుం కిశాల పథకాన్ని నేను ఆనాడే వ్యతిరే కించానని గుర్తు చేశారు. ఆనా డు సుంకిశాల కోసం పెట్టిన ఖర్చు ఎస్ ఎల్ ఎల్ బి సి ప్రాజెక్టు కు పెట్టి ఉంటే నల్గొండ జిల్లా రైతులకు, ప్రజలకు మేలు జరిగేదని ఆశాభావం వ్యక్తం చేశారు.