–43 మందికి రూ.11,71,500 విలువ గల చెక్ ల అందచేత
–నల్లగొండ క్యాంపు కార్యాలయం లో లబ్ధిదారులకు అందజేసిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutta Sukhender Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు అనా రోగ్య సమస్యలతో ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 43 మంది నిరుపేద ప్రజలకు ముఖ్య మంత్రి సహాయనిది పథకం ద్వారా మంజూరు అయిన రూ. 11,71, 500 విలువ గల చెక్లను (cheques) ఆదివారం నల్గొండ పట్టణంలోని క్యాంపు కా ర్యాలయంలో లబ్ధిదారులకు తెలం గాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధీ పథకం నిరుపేదలకు వరం లాంటిది అన్నా రు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందు తుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చెక్ లను రిలీజ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy)పేద ప్రజలకు సహాయం చేశారన్నారు. ఈ పథకాన్ని నిర్వి రామంగా కొనసాగిస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బా అశోక్ సుందర్ , వెంకటేశ్వర రావు , గోపాల్ రెడ్డి , యాదగిరి , మునాసా వెంకన్న , సైదులు గౌడ్ , తదితరు లు పాల్గొన్నారు .