– శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
– ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్టులు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించడమే ధ్యేయంగా తన వంతుగా తనవంతుగా కృషి చేస్తానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి , గాదె రమేష్ ఆధ్వర్యంలో కార్యవర్గం తో కలిసి మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సమాజ హితం కోసం పనిచే సే జర్నలిస్టులకు ఎల్లవేళలా అం డగా ఉంటానన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమా మిడి మహేందర్ రెడ్డి గాదె రమేష్ మాట్లాడుతూ జర్నలిస్టు సమస్య లను సావధానంగా విని పరిష్క రించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి ధన్యవా దాలు తెలిపారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం సహకారం అందించాలని కోరామన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు, ప్రెస్ క్లబ్ సలహాదారుడు గుండగోని జయశంకర్ గౌడ్, దీకొండ రవి శంకర్, సల్వాది జానయ్య, సివి ఆర్ వెంకటరెడ్డి, దండంపల్లి రవికు మార్, ఉబ్బని సైదులు, జిన్నే శ్రీని వాస్ రెడ్డి, పోగుల రమేష్, పెద్దగొని మధు, ముచ్చర్ల విజయ్, ముచ్చర్ల శ్రీనివాస్, రవిశంకర్, అల్లి మల్లికా ర్జున్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్, నీలకంఠం మధు, చంద్రశేఖర్, నవీ న్, జిల్లా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.