–రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutta Sukhender Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: మీ భవిష్య త్తు మీ చేతుల్లోనే ఉందని, మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించవచ్చ ని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గు త్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy)అన్నారు.జిల్లా పో లీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవా రం నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన్ సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రాష్ట్ర ,దేశవ్యాప్తంగా (State, Nationwide)యువతను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్(drugs) అని, వాటి బారి నుండి యువతను కాపాడుకోవా ల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసన మండలి చైర్మన్ తెలిపారు. ఒక్కసారి మత్తు పదార్థాలకు ఆలవాటు పడితే బయటకు రావడం కష్టమని అందు వలన యువత ముఖ్యంగా విద్యా ర్థులు చదువుకునే వయసులో ఏ రంగం లో ప్రతిభ చాటవచ్చో గుర్తిం చి ఆలోచించి అటువైపు ప్రయాణిం చాలని సూచించారు. జీవితంలో ఏది సాధించాలన్న కృషి ,పట్టుదల అవసరమని, కష్ట పడే ఆలోచన విధానం పై దృష్టి పెట్టాలని, మంచివారితో స్నేహం చేయాలని, చెడు వ్యసనాలకు ఎవరు బానిసలు కావద్దని పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని ఎలాంటి మత్తు పదార్థాలు లేని తెలంగాణగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరిం చాలని ఆయన కోరారు.
రెండవ బహుళ జోన్ ఐ జి సత్యనారాయ ణ IG Satyanarayana)మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అన్ని దుష్పరిణామాలే అని ,యువత మంచిని కోరుకునే వైపు వెళ్లాలని సూచించారు.చెడు వ్యసనాల వల్ల చెడు దారి పడతారని ,అలా చేయవద్దని తల్లిదండ్రులు సైతం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. గంజాయి పై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ, సమాజంలో తల్లిదండ్రులు, అందరూ సహకరించినప్పుడే ఇది సాధ్యమ వుతుందని తెలిపారు.జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy)మాట్లాడుతూ నల్గొండ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
చదువుకునే సమయంలో విద్యార్థులు చదువు పైనే దృష్టి పెట్టాలని, చదువుపై కాకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్తు కోల్పోతారని అన్నారు .జిల్లాలో గంజాయి వాడకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ,ఏ ఒక్కరు గంజాయిని వాడవద్దని, గంజాయి వాడడం వల్ల అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, యువత ఏ ఒక్కరు గంజాయి వాడకుండా చూడాలని, తద్వారా మాదక ద్రవ్యాల రహిత నల్గొండగా తీర్చిదిద్దారని కోరారు.జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar)మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గంజాయి తో పాటు, మత్తు మందుల నివారణలో భాగంగా పోలీస్ యంత్రాంగం ద్వారా అవ సరమైన అన్ని చర్యలు తీసుకుం టున్నామని, ప్రత్యేకించి గంజాయి రహిత నల్గొండ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామని, ఈ కార్యక్రమాలను విజయ వంతంగా నిర్వహించేందుకు సహ కరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంద ర్బంగా మాదక ద్రవ్యాల పై ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ప్రతీక్ ఫౌండే షన్ సీఈఓ గోనా రెడ్డి,అడిషనల్ ఎస్పి రాములు,నాయక్ , ఎక్సయిజ్ సూపరింటెండెంట్ సంతోష్, డిఎ స్పీలు,సి ఐ లు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.