Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gutta Sukhender Reddy: ప్రస్తుతo ఖర్చులు తగ్గించుకోవడం ప్రభుత్వానికీ అవసరం

–రైతు బంధు, భరోసా పదెకరాల వరకు ఇస్తేనే శ్రేయస్కరం
–వచ్చే రెండేళ్లలో అమల్లో పునర్విభజన చట్టo
–తెలంగాణలో 34, ఏపీలో 50 అసెంబ్లీ సీట్లు పెరగడం ఖాయం
–నల్లగొండ మీడియా చిట్ చాట్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutta Sukhender Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని రూ. 7లక్షల కోట్ల అప్పు ఉందని రాష్ట్ర ప్రభు త్వం స్వయంగా శ్వేత పత్రం విడు దల చేసిందని శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) పేర్కొన్నా రు. రాష్ట్రం అప్పుల్లో కూరుకపో యిందన్న విషయం బహిరంగ రహస్యమే అయినందున ఇలాంటి పరిస్థితిలో ఖర్చులు తగ్గించుకో వడం మంచిదని వ్యక్తిగతంగా హిత వు పలికారు. రైతు బంధు, రైతు భరోసా (Rythu Bharu, Rythu Bharosa)కేవలం పది ఎకరాల వరకు ఇస్తే చాలని,సేద్యం చేసే భూ ముల కు మాత్రమే రైతు బంధు ఇ వ్వాల నే అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలో ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లా డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరో సా పై ప్ర జాభిప్రాయ సేకరణ చేప ట్టడం మంచిదేనని కితాబునిచ్చా రు. ఇక రాష్ట్ర శాసన మండలి రద్దు అనేది అసంబద్ధమని, అలాంటి పరి స్థితే ఉత్పన్నం కాదని సుఖేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే రెండేళ్ల లో 2026 సంవత్సరంలో నియోజక వర్గాల పునర్విభజన చట్టం అమల వుతుందని, అప్పుడు తెలంగాణలో 36, ఆంధ్రప్రదేశ్ లో 50 అసెంబ్లీ సీ ట్లు పెరుగుతాయని చెప్పారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల (MLAs, MLC) అనర్హత విషయంలో గతంలో మండలి చైర్మన్, స్పీకర్ గా వ్యవహరించిన వారు తీసుకున్నట్టుగానే తన నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పారు. శాస న మండలి చైర్మన్ హోదాలో ఉండి రాజ కీయాల గురించి మాట్లాడనని అన్నారు. ఏపీ,తెలంగాణ ముఖ్య మంత్రులు భేటీ కావడం శుభపరి ణామమని, చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. రెండు రాష్ట్రాల సీఎంల (cms) కలయికను అభివృద్ధి కోణంలోనే చూడాలని, అందులో రాజకీయ కోణం జొపించ వద్దని అన్నారు. సీఎం ప్రతిపక్షాల బెదిరంపులకు అస్సలు భయపడ వద్దని, అప్పుడే అభివృద్ధి చేసుకోగ లుగుతామని అన్నారు. తెలంగాణ కు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలు మి నహా మరో మార్గం లేదని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి సీఎం ఎంతో ప్రయత్నిస్తున్నారని చెప్పా రు. వచ్చే రెండేళ్లలో ఎస్ఎల్ బీసీ (SL B.C)పెండింగ్ పనులు పూర్తి చేయాలని, తద్వారా నల్లగొండ జిల్లాలో సాగు నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుం దని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చాలా కష్టపడుతున్నారని సుఖేం దర్ రెడ్డి చెప్పారు. జిల్లాలో ఉన్న పెండింగ్ పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయని అనుకుంటున్నామని తెలిపారు.