ప్రజా దీవెన, నలగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించ డం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డు తూ జాతీయ సేవా పథకం వాలం టీర్స్ హక్కులతో పాటు బాధ్యత లను కూడా నిర్వర్తించాలని సూచించారు. కాశ్మీర్లో దేశ రక్షణకు సైనికులు ఎలాంటి బాధ్యత వహిస్తారో మానవ హక్కులను పరిరక్షించడానికి జాతీయ సేవా పథకం వాలంటీర్లు ఆ రకమైన బాధ్యత వహించాలని విద్యా ర్థులకు దిశా నిర్దేశం చేశారు. మనలో ప్రతి ఒక్కరికి హక్కుల తో పాటు బాధ్యతలు ఉంటాయని వాటిని మరిచిపోకూడదు అని సూ చించారు. విద్యార్థులు విశ్వ విద్యాలయం నుంచి పౌర సమా జంలోకి వెళ్లేసరికి వారికి విచిత్ర మైన అనుభవాలను ఈ సమాజం నేర్పిస్తుంది ఆ క్రమంలో వారు హ క్కుల తో పాటు విధులను సక్ర మంగా నిర్వహించి దేశ పురోగ తిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సంద ర్భంగా మహాత్మా గాంధీ విశ్వవి ద్యాలయం సోషల్ వర్క్ డిపా ర్ట్మెంట్ అధ్యక్షులు డాక్టర్ శ్రీరాం గారు కీలక ప్రసంగం చేశారు. శ్రావణ్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి హక్కుల తో పాటు బాధ్యతలు బండికి ఉన్న రెండు చక్రాలు లాంటివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణారెడ్డి, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ నీలకంఠం శేఖర్ డాక్టర్ స్వప్న డాక్టర్ ఆనంద్ ఎన్ఎస్ఎస్ సిబ్బంది హరి కిషన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.