Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Illegal Patta: అక్రమ పట్టాను వెంటనే రద్దు చేయాలి

నల్గొండ మండలం లోని దండంపల్లి గ్రామం లో సర్వే నెం 101 యందు ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న భూస్వామి బుసిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబానికి ఇచ్చిన పట్టాను రద్దు చేసి దండంపల్లి దళిత పేదలకు న్యాయం చేయాలని జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వాన్ని మోసగించి వారిపై చర్యలు తీసుకోవాలి

గోలి సైదులు

ప్రజా దీవెన నల్గొండ టౌన్:  నల్గొండ మండలం లోని దండంపల్లి గ్రామం లో సర్వే నెం 101 యందు ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న భూస్వామి బుసిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబానికి ఇచ్చిన పట్టాను రద్దు చేసి దండంపల్లి దళిత పేదలకు న్యాయం చేయాలని జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు(Mala Mahanadu National Steering Committee member Goli Saidulu) గోలి సైదులు డిమాండ్ చేశారు. అక్రమ పట్టాను రద్దు చేయాలని కోరుతూ బాధితులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ హరి చందన దాసరికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండంపల్లి గ్రామం లో సర్వే నెం 101 యందు 111 ఎకరాల 37 గుంటల ప్రభుత్వ భూమి ఉంది.

అందులో నుండి నల్గొండ పట్టణం లోని సీతారామచంద్ర దేవాలయానికి 53 ఎకరాల 8 గుంటల భూమిని దేవాలయానికి ఇచ్చిరు. అయితే తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన బుసిరెడ్డి వెంకట్ రెడ్డి తండ్రి చంద్ర రెడ్డి అంధ విద్యార్థి పేరుతో 54 ఏకరముల ప్రభుత్వ భూమిని అధికారులతో కుమ్మక్కు అయి స్పెషల్ లావుని పట్టా పేరుతో 1954 సం. లో ఆక్రమంగా పట్టా పొందినాడని తెలిపారు. సర్వే నెం 102 యందు స్వంతంగా 7 ఏకరాల 37 గుంటల భూమి కలిగి యున్నాడు. 1973 లో భూ సంస్కరణ చట్టం ద్వారా డిక్లరేషన్ ఇవ్వకుండా మిగులు భూమి ప్రభుత్వానికి చూపలేదని పేర్కొన్నారు.

అక్రమ మార్గం లో రెవిన్యూ అధికారులతో కలిసి భూ సంస్కరణ చట్టాన్ని(Land Reform Act) నీరుగార్చి ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నాడని,ప్రభుత్వాన్ని మోసగించిన బుసిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుమీద గల పట్టాను రద్దుచేసి భూమిలేని దళిత నిరుపేదలకు ఇవ్వాలని గతంలోనే జిల్లా కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తాసిల్దార్ లు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

అక్రమ మార్గం లో పట్టా పొందిన బుసిరెడ్డి వెంకట్ రెడ్డి సభ్యులు వ్యవసాయం చేయకుండా పక్క గ్రామాల రైతులకు కౌలుకు ఇస్తూ ఫల సహాయం పొందుతున్నారని, భూ సంస్కరణ చట్టాన్ని (Land Reform Act) నీరుగార్చి ప్రభుత్వాన్ని మోసగించి ప్రభుత్వ భూమిని వ్యవసాయం చేయకుండా కౌలుకు ఇస్తున్న వారిపై చర్యలు తీసుకొని అతని కుటుంబ సభ్యుల పేరున గల పట్టాను రద్దు చేసి నిరుపేదలైన భూమిలేని దళితులకు ఇప్పించాలని కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో గోలి నర్సింహ్మ, మేడి వెంకన్న, చింత అర్జున, చింత ఆంజనేయులు, మేడి బాస్కర్, ఇంద్రకంటి సైదులు, చింత రేణుకమ్మ, చింతపల్లి రామలింగయ్య, చింతపల్లి నర్సిహ్మ రావు, చింత లింగయ్య, గద్దపాటి సుజాత తదితరులు ఉన్నారు.

 

Illegal Patta cancelled immediately