ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలక్టరేట్ ముందు 23వ రోజు కూడా ఆ సంఘం ఆధ్వర్యంలో కొనసాగిన నిరవధిక సమ్మె. సమ్మెలో భాగంగా చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. 20 ఎండ్ల నుండి వెట్టి చాకిరికి గురి ఔతున్నమని, ఈ బానిస బ్రతుకుల సంకెళ్లను ప్రభుత్వమే తీసివేసి తక్షణమే పే స్కేల్ అమలు చేస్తూ విద్యా శాఖలో విలీనం చేయాలని కోరారు.ఈ సందర్బంగా అధ్యక్ష కార్యదర్శులు మొల్గూరి కృష్ణ బొమ్మగానీ రాజు మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేసి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి మా యొక్క డిమాండ్ లకు పరిష్కారం చూపాలని కోరారు. దీక్షకు మద్దతు గా టీయుపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరుగు శ్రీరాములు బత్తిని భాస్కర్, రాష్ట్ర నాయకులు పాపిరెడ్డి, మీర్యాల మురళీ, శ్రీనివాస్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, ఎమ్ నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి , కోశాధికారి పుష్పలత
, సాయిలు , ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు,ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, బిక్షమా చారి, మొయిజ్ ఖాన్, పరమేశ్,నాగభూషణం చారి, రహీం, పాండు నాయక్, జానయ్యా, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.