ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె నల్గొండ జిల్లా కలెక్టర్ ముందు జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 15 వ రోజు ఒంటి కాలిపైన నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోల్గురి కృష్ణ బొమ్మగానీ రాజు మాట్లాడుతూ గత 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్షా ఉద్యోగులం విధులు బంద్ చేసి సమ్మె కొనసాగిస్తూ వివిధ రూపాలలో నిరసన చేసినా మా యొక్క డిమాండ్ లను ప్రభుత్వం స్పందించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి వివిధ ఉపాధ్యాయ సంఘాలు వివిధ సంఘాల మద్దతు తెలిపి వీరి యొక్క న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం పరిశీలించి తక్షణమే ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని కోరారు. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి కుర్షిత్ మియా ప్రధాన కార్యదర్శి వెంకులు ,ఏడుకొండలు, వెంకన్న, అంజయ్య, లక్ష్మయ్య, వీరస్వామి, వీరారెడ్డి ,బ్రహ్మచారి, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు రవి నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు నరేష్, శంకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, టీఎస్ యుటిఎఫ్ చిట్యాల మండల అధ్యక్షుడు ఏ నాగయ్య, టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి నాగమణి, ఉపాధ్యక్షులు సిహెచ్ అరుణ, రమాదేవి, వేదశ్రీ ,సంతోష్, జానకి, వరలక్ష్మి ,వాయిస్ ఆఫ్ టీచర్స్ ప్రొఫెసర్ డాక్టర్ టి వెంకట రాజయ్య , అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నగ్మా వేణు యాదవ్ పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గురి కృష్ణ, బొమ్మగాని రాజు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్, కార్యదర్శి కంచర్ల మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ , మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజుల , ముఖ్య సలహాదారు నీలంబరి, స్పెషల్ ఆఫీసర్ వసంత, సావిత్రి, గౌరవ సలహాదారు కొండయ్య ,నాగయ్య , వెంకటకృష్ణ, గిరిధర్, శ్రీనివాసులు, మోహిజ్ ఖాన్, భిక్షమాచారి, చందపాక నాగరాజు,బంటు రవి తదితరులు పాల్గొన్నారు.