-నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి
Inspector Rajasekhar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండలోని సాగర్ రోడ్డు లో గల డాన్ బోస్కో స్కూల్లో జిల్లా (Don Bosco School District) ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) ఆదేశానుసా రo మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థిని, విద్యా ర్దులతో గంజాయి, మాదక ద్రవ్యా లపై నల్లగొండ వన్ టౌన్ పోలీస్ అవగాహన (Police awareness) కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్ రెడ్డి మాట్లా డుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని, వారికి నచ్చిన రంగంలో ఎదగాలని, ముఖ్యంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
అదే విధంగా మన చుట్టూ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను (Non-social activities)జాగ్ర త్తగా గమనిస్తూ, అలాగే సమాజం లో ఉన్న చట్టాల పట్ల అవగాహన కలిగి ఉంటూ ప్రతి విద్యార్థి జరగ బోయే, జరుగుతున్న నేరాలను అరి కట్టుటకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 100 కాల్ (100 call) చేసి పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఎస్సై శంకర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులకు ఇబ్బం దులు కలిగించే విధంగా వారి చర్య లు ఉండకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జానీ పాషా, మహమూద్, సత్య నారాయణ, ఇంద్రారెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ బాలశౌర్య రెడ్డి, ప్రవీణ్, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.