Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

International Yoga Day: ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

International Yoga Day: ప్రజా దీవెన, చిట్యాల: చిట్యాల మండలం లోని వివిధ గ్రామాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) ఘనంగా నిర్వహించారు. యోగ మానవాళికి గొప్పవరం, మెడిటేష న్ తో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు పేర్కోన్నారు.శుక్రవారం చిట్యాల మం డలం గుండ్రంపల్లి, ఉరుమడ్ల గ్రామం లలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులచే, ఉపాధి హామీ కూలీ చే యోగా కార్యక్ర మాలు చేయించడం జరిగింది ఆసనాలు వేయించి మెడిటేషన్ చేయించారు. పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ 14వ అంతర్జా తీయ యోగా దినోత్సవం సంద ర్భంగా శుక్రవారం గుండ్రంపల్లి ఉరు మడ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ యొక్క యోగ (YOGA) కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషకర మని, మనసును తన ఆధీనంలోకి తీసుకురావడమే మెడిటేషన్ అన్నా రు.

ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్లగొండ (NALGODA) జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ వాలంటీర్ చే వామప్, యోగాసనాలు వేయిం చడం జరిగిందన్నారు. ఈ యోగ మెడిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ ఆనందాన్ని వ్య క్తం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ . దీని ద్వారా ధ్యానం మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసలను చక్కగా పొందుతారు. శారీరక మరియు మానసిక బల హీనత నుండి విముక్తి చెందుతా రన్నారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి యోగ, మెడిటేషన్లకు ఉన్నదని, విద్యార్థులు చదువులలో రాణించాలంటే ప్రతినిత్యం యోగా మెడిటేషన్ చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి, మరియు పాఠశాలల ఉపాధ్యాయులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొనేటి యాదగిరి, చెరుకు సైదులు, మేడ బోయిన శ్రీను, కురుపాటి లింగయ్య, బోయ స్వామి, గంగాపురం వెంకన్న, గుత్తా రవీందర్ రెడ్డి, బొడ్డు శ్రీను, పట్ల జనార్ధన్,మర్రి రమేష్, సత్యనారాయణ, దినేష్, శ్రీను, స్వామి తదితరులు పాల్గొన్నారు.

12వ పోలీస్ బెటాలియన్ లో… అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా నల్లగొండ సమీపంలో ని అనపర్తి 12వ బెటాలియన్ లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వ హించడం జరిగింది. శుక్రవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో టీచర్ బాలకృష్ణ నేతృత్వంలో బెటాలియన్ అధికారులు సిబ్బందికి యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయి శిక్షణ కార్యక్రమం అనం తరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరగతుల నిర్వహణ పట్ల అధికారులు, సిబ్బంది సంతోషాన్ని వ్యక్తపరి చారు. ఆర్ట్ ఆఫ్ లింకు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమం లో బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాసరావు, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రవిచంద్రన్,
ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్లగొండ ప్రతి నిధులు గుoడగోని జయశంకర్ గౌడ్, పల్లపు బుద్ధుడు తదితరులు పాల్గొన్నారు.