–నల్లగొండ జిల్లా మదారిగూడెం కు చెందిన మహేష్
Jawan died: ప్రజా దీవెన, నల్లగొండ: ఇండియన్ ఆర్మీ (Indian Army)లో జవాన్ గా విధులు నిర్వర్తి స్తున్న మహేష్ (mahesh) (24) మృతి చెందా రు. అస్సాం లో తెలంగాణ జవాన్ మృతి చెందినట్లు ఆర్మీ (army)ప్రకటిం చింది. నల్గొండ జిల్లా అనుముల (మం) మదారిగూడెం కు చెందిన ఈరటి మహేష్ ఏడాదిన్నర కాలం గా అస్సాంలో ఆర్మీ జవాన్ గా (Army jawan in Assam)విధు లు నిర్వర్తిస్తున్నారు. అస్సాం లో స్థానికంగా వాతావరణం ప్రతికూల పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైన మహేష్ అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. మృతదేహాన్ని (dead bosy) స్వగ్రామానికి పంపేo దుకు అస్సాం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్మీ జవాన్ మహేష్ మృతితో స్వగ్రామైన మదారిగూడెం లో విషాద చాయలు అలుముకు న్నాయి.