job fair: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా ఉపాధికల్పన కార్యాలయములోబుధవారం నిర్వ హించిన మినీ జాబ్ మేళ (job fair)విజయ వంతంగా ముగిసిందని జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సామ మాధవ రెడ్డి (Employment Officer Sama Madhava Reddy) తెలిపారు. ఈ జాబ్ మేళలో ఐదు ప్రముఖ కంపెనీలు హాజరు కాగా మొత్తం 117 మంది అభ్యర్థు లు పాల్గొన్నారని చెప్పారు. హాజరై న వారిలో 56 మంది ప్రాథమిక స్థాయి ఎంపిక కాగా KL గ్రూప్ లో 9 మంది, అనపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఇద్దరు, ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ (Airtel Payment Bank) లో ముగ్గురు, వెస్టీజ్ 8 సంస్థలలో మొత్తం 22 మంది ఉద్యోగం సాదించారు. ఉద్యోగం పొందిన వారికి ఉపాధి కల్పన కార్యాలయం జూనియర్ ఎంప్లా యిమెంట్ ఆఫీసర్ సామ మాధ వరెడ్డి నియామక పత్రాలు అందజేసారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.