Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Joint meeting: కూలి రేట్ల పెంపు కోసం జాయింట్ మీటింగ్

Joint meeting:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పవర్లూమ్ కార్మికుల కూలి రేట్ల పెంపు కోసం యజమానులతో జాయింట్ మీటింగ్(Joint meeting) ఏర్పాటు చేయాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (Telangana Power Loom Workers Union)(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య (Secretary Dandempalli Sattaiah)కోరారు. శుక్రవారం అసిస్టెంట్ లే బర్ కమిషనర్ అరుణకుమారిని కలిసి యజమానులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ 2024 మార్చి 31 నాటికి ఒప్పంద గడువు ముగిసినప్పటికీ నూతన రేట్ల పెంపుదల కోసం యాజమాన్యాలకు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందించడం లేదని అన్నారు. ఆరు నెలలు అవుతున్న యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని లేబర్ అధికారులు జోక్యం చేసుకొని పవర్లూమ్ యాజమాన్యం ,కార్మికులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి నూతన రేట్ల పెంపుదల కోసం చర్చించవలసిందిగా కోరారు.

కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని, ప్రమాద బీమా, రక్షణ సౌకర్యాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పవ ర్లూమ్ వర్కర్స్ యూనియన్ పద్మా నగర్ ఏరియా అధ్యక్షుడు గంజి నాగరాజు, కార్యదర్శి సూరపెళ్లి భద్రయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి పసునూరి యోగానందం, ఐ డి ఏ ఆర్జలబావి ఏరియా అధ్యక్షులు పెండెం బుచ్చి రాములు, కార్యదర్శి దేవులపల్లి గిరిబాబు ,కోశాధికారి నిమ్మనగోటి సైదులు తదితరులు పాల్గొన్నారు