–ప్రిన్సిపల్ స్టేషన్స్ జిల్లా జడ్జి ఎం .నాగరాజు
Judge M. Nagaraju: ప్రజా దీవెన నల్లగొండ: సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్చా, స్వాతంత్ర్యాలు కలిగి ఉన్నప్పుడే నిజమైన స్వాతం త్రం వచ్చినట్లు అని,అందుకోసమే గాంధీ మహాత్ముడు కృషి చేశారని ప్రిన్సిపల్ స్టేషన్స్ జిల్లా జడ్జి ఎం .నాగరాజు(Judge M. Nagara ju)అన్నారు . గాంధీ జయంతి (Gandhi Jayanti)మరియు ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నల్గొండ జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ముందుగా ఆయన జైలు ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు
అనంతరం జైలులో (JAIL)ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ చెడును వదిలి మంచి మార్గంలో పయనించడానికి ప్రతి ఒక్కరూ సమాజానికి అనుగుణంగా ఉండాలని అన్నారు. చేసిన తప్పు మళ్ళీ చేయకుండా, తప్పును సరిదిద్దుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా సత్ప్రవర్తన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఖైదీలకు సూచించారు. జైలులో ఖైదీలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, వాటన్నింటినీ ఉపయోగించుకుని సత్ప్రవర్తనతో బయటికి వచ్చి సమాజానికి ఉపయోగపడాలన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ముఖ్యమైన దినాలలో జైలు నుండి విడుదల చేయటం జరుగుతున్నదని, అలాగే అండర్ ట్రయల్ మీటింగ్ ల సమయంలో వారి సత్ప్రవర్తన ఆధారంగా బెయిల్ ఇవ్వడం,లేదా శిక్ష తగ్గించడం వంటివి చేయడం జరుగుతున్నదని, కాంపౌండబుల్ కేసుల్లో సైతం ఈ అవకాశం ఉన్నట్లు తెలిపారు .సత్యం, అహింస, శాంతి మార్గాలను (Paths of truth, non-violence and peace) ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) మాట్లాడుతూ తప్పులు అందరూ చేస్తారని చేసిన తప్పును పశ్చాత్తాపంతో ఆ తప్పును సరిదిద్దుకొని, తిరిగి చేయకుండా . ఉండాలన్నారు. జీవితం ఒకటే ఉంటుందని, ఎంతమందికి మంచి చేశామన్నదే ముఖ్యమని ,జైలు జీవితం తర్వాత సమాజానికి ,కుటుంబానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఖైదీలు బయటికి రావాలని కోరారు .ఖైదీల సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి లోటు రానివ్వమని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) మాట్లాడుతూ, గాంధీ సిద్ధాంతాలను అందరూ అనుసరిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, ముఖ్యంగా సత్యాగ్రహం ఆహింస, సాధారణ జీవితం గడపడం, సొంతంగా తన కాళ్లపై తాను బ్రతికేందుకు ప్రయత్నిం చడం, సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ దీప్తి (DEEPTI)మాట్లాడుతూ గాంధీజి చెప్పిన విధంగా లక్ష్యం చేరుకునేం దుకు మంచి దారిని ఎంచుకోవా లని, అటువైపుగా అడుగుచే యాలని అన్నారు. గాంధీ సిద్ధాం తాలను ప్రతి ఒక్కరు పునరంకితం చేసుకోవాలని కోరారు.12 వ బటాలియన్ కమాండర్ సత్య శ్రీనివాసరావు మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు ఓపికతో ఉండి సరైన మార్గంలో వెళ్తే ఎలాంటి తప్పులు జరగవని అన్నారు. జిల్లా జైల్ సూపరిం టిండెంట్ ప్రమోద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించి స్వాగతం పలి కారు .జిల్లా జైలర్ బాలకృష్ణ , ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.