Buddhavanam: బుద్ధవనంను సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణ రావు
రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణా రావు టూరిజం ప్రమోషన్ లో భాగం గా నాగార్జున సాగర్ లోని బుద్ధవ నంను సందర్శించారు.
పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాం
బౌద్ధ టూరిజం సర్క్యూట్ లో బుద్ధ వనం అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి
పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రజా దీవెన, నాగార్జునసాగర్:రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణా రావు(Tourism Minister Jupalli Krishna Rao) టూరిజం ప్రమోషన్ లో భాగం గా నాగార్జున సాగర్ లోని బుద్ధవ నంను సందర్శించారు. సందర్భంగా మాట్లాడుతూ బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశం లో ఆవిష్కరించేలా నాగార్జున సాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని(Buddhist temple)గొప్ప గా నిర్మించారని కొనియాడారు. ఆచార్య నాగార్జునుడు నడయాడి న ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)సారథ్యంలో బుద్ధవనంను పర్యా టక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతామన్నారు.
బౌద్ధ టూరిజం సర్క్యూట్ లో తెలంగాణ లోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పా రు. యువత్, భారతదేశానికి, ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సం స్కృతిని చాటి చెప్పాల్సిన అవస రం ఉందన్నారు. నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభి వృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతా యని, తప్పక సందర్శించాల్సిన ప్రాంతం బుద్ధవనం అని పేర్కొన్నారు. శనివారం నాగార్జున సాగర్ హిల్‌కాలనీలోని బుద్ధవ నాన్ని ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao)సందర్శించారు.
బుద్ధవనానికి చేరుకున్న వారికి ఓఎస్డీ సూద న్‌రెడ్డి, బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బుద్ధవనంలో బుద్ధుని పాదాల వద్ద వారు పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత బుద్ధవనంలో మహాస్తూ పం, స్తూపవనం, జాతక వనం, ధ్యానవనంలను తిలకించారు. మహాస్తూపం లోపల కొంత సేపు ధ్యానం చేశారు. బుద్ధవనం విశేషాలను ప్రముఖ బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. బుద్ధవనంలో దేశీయ, అంతర్జా తీయ పర్యాటకులకు కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకు న్నారు.
పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచిం చారు. అనంతరం విజయ్ విహార్(Vijay Vihar)లో బుద్ధవనం అభివృద్ధి పనుల పురోగతి, మెరుగైన వసతుల కల్పనపై బుద్ధవనం, పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి(Karnati Lingareddy), పర్యాటక అభివృద్ధి సంస్థ జీఎం ప్రాజెక్ట్స్ ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Jupally krishna rao visited Buddhavanam