Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kancharla Bhupal Reddy:లగచర్ల రైతులపై అక్రమ కేసులకు నిరసనగా బిఆర్ఎస్ ఆందోళన

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: లగచర్ల రైతులపై
అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ బిఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే ఆధ్వ ర్యంలో పార్టీ సీనియర్ నాయకు లు, ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతి నిధులు ముఖ్య నాయకులు నల్ల గొండ డిఈఓ ఆఫీస్ వద్దగల భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల జరుపుతున్న అమానుషకాండను ముఖ్యంగా ఆందోళన వ్యక్తం చేస్తూ వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా భూ పాల్ రెడ్డి మాట్లాడుతూ కంచర్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపై ధమనకాండ పెరిగిపోయిందని, అక్రమ కేసులు బనాయించి జైళ్లలో నిర్బంధిస్తున్నా రని ఆరోపించారు. లగచర్లలో ఫార్మాసిటీ కోసం రైతుల భూము లు లాక్కున్నారని నిరసన వ్యక్తం చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయించి, జైలలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసల గురి చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం అపహస్యం పాలైందని అన్నారు. రామన్నపేట లో ఆదానితో కుమ్మక్కై సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి అక్కడి రైతు లను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తుం దని అన్నారు. అందుకే తాము భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మంగళ వారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు వినతి పత్రం సమర్పిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల పై జరుగుతున్న అరాచకాలను అణచివేతల నుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోందని, అన్నిటికంటే ము ఖ్యంగా దళిత గిరిజనులు ఈ రా జ్యంగా వ్యతిరేఖ చర్యల వల్ల తీవ్రంగా అణచివేతకు గురువు తున్నారన్నారు. పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తోంది.

ఈ కాంగ్రెస్ సర్కారు రాజ్యంగా వ్యతిరేకంగా అడుగడుగునా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలని, మీరు బుద్ది చెప్పాలని కోరుకుంటున్నా మన్నారు. స్వయంగా ముఖ్య మంత్రి నియోజకవర్గం కోడంగల్ లోని లగచర్ల లో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఓసారి ఫార్మా విలేజ్ అని , మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని, మాయమాటలు చెప్తూ ఏదోలాగా రైతన్నల భూ ములను లాక్కొని అదానికి, తన అల్లుడికి అప్పజెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు.

తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారాన్ని లక్కోవద్దని ప్రభుత్వానికి పది నెలలుగా విజ్ఞప్తి చేసిన పట్టించు కోకుండా నిరంకుశంగా, పాషవి కంగా పేద రైతన్నల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరాచకలను మీ దృష్టికి తీసుకువస్తున్నాము. కోడంగల్ నియోజకవర్గం తన జాగీరుగా భావిస్తూ తన సోదరు లతో పేద బడుగు బలహీన దళిత గిరిజన రైతుల పైన చేస్తున్న అరా చకాలను , అణచివేతను , ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు పోలీసులు చేసిన ధర్డ్ డీగ్రీ టార్చర్ ను మీ దృష్టికి తెస్తున్నాము. అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతన్నలను జైలులో పెట్టి, రైతన్న చేతులకు బేడీలు వేసిన రాజ్యంగ వ్యతిరేక చర్యల ను, పోలీసులు అణచివేతను వేదింపుల నుండి వారిని కాపాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.

లగచర్ల రైతుల పై అక్రమంగా కేసులు పెట్టి , వారిపైన ధర్డ్ డీగ్రీ ప్రయోగించి జైల్లలో నిర్బందించి , రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ , అమానవీయ , అణచి వేత విధానాలకు నిరసనగా రైత న్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి , వారిని వెంటనే విడుదల చేయాలని , రైతన్నల కుటుంబాలను వేదించడం హింసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ , ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సద్బుద్దిని ప్రసాదించాలని , ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించలని రాజ్యంగ నిర్మాత అయిన మీకు విజ్ఞప్తి చేస్తు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక రాష్ట్ర అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు కటికం సత్తయ్య గౌడ్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్, మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి, నల్ల గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీని యర్ నాయకులు, వంగాల సహ దేవరెడ్డి, మైనం శ్రీనివాస్, కొండూ రు సత్యనారాయణ, ఎస్కే కరీం పాషా, జమాల్ ఖాద్రి, రావుల శ్రీనివాస రెడ్డి , పట్టణ పార్టీ అధ్య క్షులు బోనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి దేప వెంకట్ రెడ్డి, అయిత గొని యాదయ్య, లు నాయకులు, దండంపల్లి సత్తయ్య,పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి,బొజ్జ నర్సిం హ,కంకణాల వెంకటరెడ్డి, కందుల లక్ష్మయ్య బడ్పుల శంకర్, తవిటి కృష్ణ, సుంకిరెడ్డి వెంకటరెడ్డి కడారి కృష్ణయ్య, జి.జంగయ్య, నారగోని నరసింహ,కన్నెబోయిన సతీష్, వీరమల్ల భాస్కర్ దొడ్డి రమే ష్,బీపంగి కిరణ్, వజ్జ శ్రీనివాస్, కున్ రెడ్డి సరోజ,బొజ్జ సైదులు, కట్ట శీను ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.