Anantarama Sharma: అనంతరామ శర్మకు సంతాపాన్ని తెలిపిన కంచర్ల
ప్రముఖ కమ్యూనిస్టు (మార్క్సిస్టు) యోధుడు, పెన్నా అనంతరామ శర్మ మృతి పట్ల నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు.
ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ప్రముఖ కమ్యూనిస్టు (మార్క్సిస్టు) యోధుడు, పెన్నా అనంతరామ శర్మ(Anantarama Sharma) మృతి పట్ల నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal reddy)సంతాపాన్ని తెలిపారు. నల్లగొండ లోని రామగిరిలో లో గల వారి నివాసంలో పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ తెలంగాణ సాయుధ పోరాటంలోనూ.. భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లోను.. ప్రముఖంగా పాల్గొని ప్రజలను ఎంతో ఉత్తేజవంతులను చేసిన గొప్ప నాయకుడు పెన్నా అనంతరామ శర్మ అని అన్నారు. అయన మరణం పేద, బడుగు, బలహీన వర్గాల వారికీ తీరని లోటని పేర్కొన్నారు.
నమ్ముకున్న సిద్ధాంతం కోసం పిడిత, తాడిత ప్రజల కోసం కడదాకా పోరాడిన మహనీయుడని అన్నారు. వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. భావితరాలకు వారి జీవితం స్ఫూర్తివంతమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం(CPM Party) పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు హశం, పాలడుగు నాగార్జున, సలీం, పాలడుగు ప్రభావతి సిపిఎం నాయకులకు బిఆర్ఎస్ పార్టీ(BRS Party) పక్షాన తమ విచారాన్ని వ్యక్తం చేశారు. పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మెరుగు గోపి,పట్టణ పార్టీ కార్యదర్శి సయ్యద్ జాఫర్,తదితరులు ఉన్నారు.
Kancharla Bhupal reddy condolence Anantarama Sharma