— నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ బ్రహ్మంగారి గుట్టపై తాను గతంలో తాను ప్రకటించిన రూ. 50 లక్షలకు తోడు మరిన్ని నిధులతో దుర్గా మాత ఆలయం నిర్మాణం చేపట్ట నున్నట్లు నల్లగొండ మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy)పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనె ప్రశస్తి పొందిన బ్రహ్మం గారి గుట్టపై వెలసిన దుర్గామాత పూజలు అందుకొనుందని చెప్పా రు. బెజవాడ కనకదుర్గమ్మ (Bejawada Kanakadurgamma) తర హాలోనే బ్రహ్మంగారి గుట్ట పై వెల సిన అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు. ఆదివా రం నల్లగొండ మాజీ శాసనసభ్యు లు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) పట్టణం లోని పలు ప్రదేశాల్లో నిర్వహిస్తున్న దుర్గాభవాని నవరాత్రోత్సవ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక రాక్ హిల్స్ కాలనీ లో పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అ త్యంత ఆకర్షణీయ సెట్టింగ్ లతో ఏర్పాటు చేసిన భవాని మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
స్వయంగా దాతగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదా లను అందజేశారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోనే అత్యంత వైభవంగా రాక్ హిల్స్ (Rock Hills) లోని దుర్గా మాత నవరాత్రి ఉత్సవాల వేడు కలు నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులకు అభినందనలు తెలియ జేశారు. దుర్గామాత నవరాత్రి (Durga Mata Navratri)ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, అమ్మవారి కృపకు వాళ్లంతా పాత్రులు అవుతారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి దుర్గా భవాని ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. బ్రహ్మంగారి గుట్టపై ఉన్న దుర్గామాత ఆలయాన్ని 50 లక్షల రూపాయలతో తాను నూ తన నిర్మాణం చేస్తానని గతంలో వాగ్దానం చేశానని, 50 లక్షలే కాకుండా అంతకు ఎక్కువైన మొత్తాన్ని వెచ్చించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనె అమ్మవారి ప్రాసెస్తానికి తెలియజేసే విధంగా వేలాదిమంది భక్తులు దర్శించుకునే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దు తామని బెజవాడలోని దుర్గమ్మ మాదిరిగా అమ్మవారు బ్రహ్మంగారి గుట్టపై పూజలు అందుకుంటారని తెలియజేశారు.
అంతకుముందు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) ఏడవ వార్డు ఏం దుప్పలపల్లి రోడ్డు లో స్థానిక కౌన్సిలర్ (Local councillor) మారగోని భవాని గణేష్ ఆధ్వర్యంలోను పద్మా నగర్ కాలనీ లో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాటుచేసిన భవాని మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్ర మాలలో రాష్ట్ర కల్లుగీత కార్పోరే షన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్గొండ మార్కెట్ కమిటీ (Nalgonda Market Committee)మాజీ చైర్మన్, చీర పంకజ్ యాద వ్, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేం దర్, కౌన్సిలర్ మారగోని భవాని గణేష్, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి,రేగట్ట మహేందర్రెడ్డి,రాపోలు వెంకటేశ్వ ర్లు,వివేక్ రెడ్డి, వందలాదిగా భక్తు లు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.