ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో వికృత చేష్టలతో అమానవీయంగా వ్యవహరిస్తున్న మానవత్వం లేని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంటన్ ప్రారంభమైందని నల్లగొండ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గాదరి కిషోర్ కుమా ర్ జోష్యం చెప్పారు.తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న క్రమంలో హైదరాబాద్ లో పోలీస్ లు చేసిన దాడిలో గాయపడ్డ మోత్కూర్ కు చెందిన రహీంబి అనే ఆశా కార్య కర్త నల్లగొండ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెను పరామర్శించి, ఆర్థిక సాయం అం దించడం ద్వారా భరోసాను కల్పించారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రోజురోజుకు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలే ఎందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు అని వ్యాఖ్యానిం చారు. ఆడబిడ్డలను అవమాని స్తూ దాడులు పెట్రేగిపోవడంతో పాటు స్వయంగా ప్రభుత్వమే ఆశ కార్యకర్తలపై దాడులకు పాల్పడ డం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, తమ సమస్యలను పరిష్కరించాల ని కోరుతూ ఆందోళన చేస్తున్న ఆ శా కార్యకర్తల పై పోలీసులు కర్క శంగా వ్యవహరించారని ఆరోపిం చారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
