Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్ లో కానిస్టేబుల్ ల సస్పెండ్ తర్వాత ఆందోళన చేస్తున్న మహిళలను పరామర్శించేందుకు శనివారం వెళ్లిన నల్లగొండ మాజీ శాసనస భ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ని (Kancharla Bhupal Reddy) పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నార్కట్ పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్ లు తిప్పి మునుగోడు పోరి స్టేషన్ కు తరలించారు.
విషయం తెలుసుకున్న బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు (BRS party state leaders) చెరుకు సుధా కర్ స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ కు తర లివచ్చి భూపాల్ రెడ్డి కి మద్ద తుగా తమ సంఘీభావం తెలి పారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ తాము బెటాలియన్ (Battalion) లోని పోలీసు కుటుంబాలను పరా మర్శించడానికి వెళితే అప్రజాస్వా మ్య పద్ధతులలో తన అరెస్ట్ చేశా రని అరెస్టులకు నిర్బంధాలకు భయపడేది లేదని ప్రజల కోసం. దేనికైనా సిద్ధమని ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక సమస్యలను పక్కదోవ పట్టిస్తుం దని ఆరోపించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
