Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రo సమీపంలోని 12 బెటాలియన్ లో గత కొద్ది రోజు లుగా బెటాలియన్ పోలీసులు తమ కుటుంబాలతో చేస్తున్న ఆందోళనల పట్ల నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) విచారం వ్యక్తం చేశారు. చరి త్రలో ఎన్నడూ లేని విధంగా బెటా లియన్ పోలీసుల మహిళలు చిన్న పిల్లలతో సహా రోడ్డెక్కి తమ సమ స్యల పట్ల ఆందోళన చేయటం అ త్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వం వారి సమస్యలను సానుభూ తితో అర్థం చేసుకొని పరిష్కరిం చాల్సి ఉందన్నారు.
కానీ వారి సమస్యల (problems) పట్ల నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తూ వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుందని అన్నారు. తాము నిన్నటి రోజున 12 th బెటాలియన్ లో ఆందోళన చేస్తున్న వారి పట్ల సానుభూతిగా వారిని పరామర్శిం చడానికి వెళ్ళినప్పుడుపోలీసులు తమ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించి అరెస్టు చేశారని ఆరోపించారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమని అ న్నారు. చరిత్రలో ఇంతవరకు ఎ ప్పుడు కూడా పోలీసులు యూని ఫామ్స్ తో ఆందోళన చేసిన దాఖ లాలు లేవని, ప్రభుత్వం వీరి సమ స్యల పట్ల నిమ్మకు నీరెత్తినట్టు ఉం డటం వలనే వారు ఆందోళనకు ది గాల్సి వచ్చిందని అదేవిధంగా కొం తమంది పోలీస్ ఉన్నతాధికారు లు కిందిస్థాయి అధికారులు, వారి ఆందోళన పై రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, కించపరిచే విధంగా మాట్లాడటం పోలీసులే పోలీసుల (police) పట్ల ఈ విధంగా ప్రవర్తించడం శోచ నీయమని అన్నారు.
ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ప్రభు త్వం వారి సమస్యలను (problems) సాను భూతితో పరిష్కరించి వారికి న్యా యం చేయాలని, అదేవిధంగా స స్పెండ్ చేసిన పోలీసులు అందర్నీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కంచర్ల డిమాండ్ చేశారు.వారి ఆందోళనకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, తక్ష ణమే వారి సమస్యలు (problems) సాను భూతితో పరిశీలించి పరిష్కరించ కుంటే వారితో కలిసి తాము కూడా ఆందోళనలో పాల్గొంటామని తెలియజేశారు.