Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థి తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా కాంగ్రెస్ నాయకులు నల్గొండ మాజీ ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy), తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ లపై చేస్తున్న అను చిత వ్యాఖ్యలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు (TRS party leaders) ఖండించారు. నల్గొండ నియోజక వర్గం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పార్టీ ప్రతిని ధులు ప్రజా ప్రతినిధులు వీటీ కాలనీలోని కేబీఆర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లా డుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 20 సంవత్సరాల పదవీకాలంలో చేసిన అభివృద్ధిపై కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చకు వస్తారని సవాల్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కౌన్సిలర్ గా ఎంపీపీలుగా జెడ్పిటిసిలుగా ఎంపీటీసీలుగా గెలిచిన వలస నాయకులు టిఆర్ఎస్ పార్టీ (TRS party)ని విమర్శించడం వలన ప్రజలు అసహ్యించుకుంటున్నారని దమ్ము ధైర్యం ఉంటే పదవులకు రాజీనామా చేసి మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో ఉమ్మడి రాష్ట్ర కల్లుగీతా కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ ఆర్ ఓ మాలే శరణ్య రెడ్డి, నల్గొండ మున్సిపల్ (Nalgonda Municipal) మాజీ చైర్మన్, మందడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, మాజీ ఎంపీపీలు, ఎస్కే కరీం పాషా, నారబోయిన బిక్షం లు, కనగల్సింది విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, తిప్పర్తి కనగల్ నల్గొండ..మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగొని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి, లు కౌన్సిలర్ మారగొని గణేష్, కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, మెరుగు గోపి.. కందుల లక్ష్మయ్య.. వనపర్తి నాగేశ్వరరావు, బడుపులశంకర్.. తవిటి కృష్ణ, మాజీ ఎంపీటీసీ సందీప్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు పొనుగోడు జనార్దన్ రావు, కడారి కృష్ణయ్య, నారగోని నరసింహ, పురుషోత్తం, కోట్ల జయపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడు కట్ట శ్రీను, నాయకులు, గంజి రాజేందర్, దొడ్డి రమేష్, బీపంగి కిరణ్ పెరిక యాదయ్య తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.