–తన అనుచరుల లబ్ధికోసమే బాధితులు మోసం
–ఉప సమహరించుకోకుంటే మహా ఉద్యమo
— నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ రింగ్ రోడ్డు (Nalgonda Ring Road) భూ బాధితుల కు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy)ఆధ్వర్యంలో నల్లగొం డ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలవా రు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాల యంలో కలెక్టర్ నారాయణ రెడ్డి (Collector Narayana Reddy) కలుసుకొని వినతి పత్రం సమర్పిం చారు. ఈ సందర్బంగా కలెక్టర్ తాము స్వయంగా స్థల పరిశీలన జరిపి ప్రభుత్వం తోనూ ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులతోను మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఇది రింగ్ రోడ్ కాదు దొంగ రోడ్ అని తమ అనుచరులకు దోచి పెట్టడానికి మంత్రి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. దాదాపు 3000 కుటుంబాలను తాము కష్టపడి చమటోడ్చి సంపా దించుకున్న ప్లాట్లు, ఇండ్లు, నష్ట పోతున్నా పట్టించు కోకుండా అధి కారం ఉందనే అహంకారం తో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు.బాధితుల గోడు పట్టించుకోవట్లేదని, అందరికి ఆమోద యోగ్యమైన ప్లాన్ 1,2, వదిలేసి తమ అనుచరుల లబ్ధి కోసం ప్లాన్ 3 ఎంచుకున్నారని ఆరోపించారు. తక్షణం ప్లాన్ 3 ఉప సంహారించుకోవాలని,లేకుంటే బాధి తుల తరుపున తాము పోరాడు తామని హెచ్చరించారు. ప్లాన్ మార్చుకునేందుకు పక్షం రోజుల సమయం ఇస్తున్నామని, ఈలోగా ప్లాన్ 3 ఉత్తర్వులను ఉపసంహరిం చు కోకుంటే ఎంతమంది బాధితు లున్నారో వారందరి తో కలిసి పాద యాత్ర చేస్తామని, ఆతర్వాత ఉత్త ర్వులు రద్దు చేసేవరకు దశల వారీ గా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని (GOVERMENT) హెచ్చరించారు.భారీ ఎత్తున రింగ్ రోడ్ బాధితులతో పాటు జిల్లా గ్రంధా లయ సంస్థ మాజీ అధ్యక్షులు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,కాంచనపల్లి రవీందర్ రావు,జమాల్ ఖాద్రి,కౌన్సిలర్ మారగోని గణేష్,మెరుగు గోపి,షంశుద్దీన్, గంజి రాజేందర్,వజ్జే శ్రీనివాస్,దొడ్డి రమేష్, సైదిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.