Kancharla Bhupal Reddy: ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విశ్వవసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ముందుగా వేదపండితులు, మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉగాది పచ్చడి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల మానస వేణు.. సంగీత విభావరి కార్యక్రమం, బాలు మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్యం, ఆహూతులను అలరించింది.
అనంతరం తెలుగు భాషా సాహిత్యం పై, విశేష కృషి చేసిన కవులకు, కళాకారులకు, ఉగాది పురస్కారాలను అందజేశారు.. పురస్కారాలు అందుకున్న వారి లో
సాగర్ల సత్తయ్య, చిలువేరు లింగమూర్తి, పుట్ట బత్తుల రామకృష్ణ, దాసోజు జ్ఞానేశ్వర్, కనకటి రామకృష్ణ, రావిరాల అంజయ్య, కోమటి మధుసూదన్, శాస్త్రీయ సంగీత విభాగంలో తిరుమల మానస వేణు, ప్రముఖ తబలా కళాకారులు జయప్రకాష్, కీబోర్డ్ ప్లేయర్ లక్ష్మీనారాయణ, శాస్త్రీయ నృత్య శిక్షకులు బాలు మాస్టర్, లకు విశ్వాసు నామ ఉగాది పురస్కారాలు అందచేసి.. శాలువా పూలమాలల తో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ
విశ్వావసు నామ సంవత్సరంలో తెలుగు వారందరికీ మంచి జరగాలని, భగవంతుడు వారందరికీ ఆయురారోగ్యాలు కలిగించాలని, పేర్కొన్నారు. నల్లగొండ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్లగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, జె. వెంకటేశ్వర్లు, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, కంచనపల్లి రవీందర్రావు, కొండూరు సత్యనారాయణ,.. సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, ధోటి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కరీం పాషా,బొజ్జ వెంకన్న, లొడంగి గోవర్ధన్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, సింగం లక్ష్మి, మాజీ కౌన్సిలర్లు మారగోని గణేష్, రావుల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు గోపి, మాజీ ఎంపీటీసీలు పోగాకు గట్టయ్య, ఊట్కూరు సందీప్ రెడ్డి, మాజీ సర్పంచులు గుండెబోయిన జంగయ్య, కోట్ల జయపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కందుల లక్ష్మయ్య , కౌకూరి వీరాచారి, సూర మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
