Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kancharla Bhupal Reddy: కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం.. పై కోర్టుకు అప్పీలుకు వెళ్తున్నాం

–పై కోర్టు తీర్పు వచ్చేవరకు బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చొ ద్దు
–అంతవరకు ప్రభుత్వ,ప్రజావస రాలకు ఉపయోగించుకోండి
–నల్గొండ లోని ఏ పార్టీ కార్యాల యానికి అనుమతులు లేవు
–ఈ విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలి
–మంత్రి కోమటిరెడ్డి మాటలకు, మోసపోవద్దని అధికారులకు వినతి
— మీడియా సమావేశంలో నల్లగొం డ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని నల్ల గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy)పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే పైకోర్టుకు వెళ్తున్నామని, హైకోర్టు తీర్పు వచ్చే వరకు తొందరపడి జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూల్చవద్దని కో రారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటి కాలనీ లో గల జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో (BRS Party Office) గురు వారం జరిగిన మీడియా సమా వే శం లో ఆయన మాజీ జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయ కులు చెరుకు సుధాకర్ నిరంజన్ వలి, చీర పంక జ్ యాదవ్ లతో కలిసి మాట్లా డుతూ నిబంధనల మేరకు నాటి మంత్రివర్గ ఆమో దం తో ఆగ్రో సంస్థకు చెందిన, ఎకరం భూమి, తాము ప్రభుత్వ నిబంధన ల మేరకు డబ్బులు చెల్లించి తీసు కొని అందులో పార్టీ కార్యాలయా న్ని నిర్మాణం చేశామని అందులో గత మూడు సంవత్సరాలుగా అనే క కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ ని, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా పార్టీ పై కక్షపూని అనేక సమావేశాలలో పార్టీ కార్యాలయాన్ని కులగొట్టాలని అధికారులను ఆదేశించిన విష యం అందరికి తెలిసిందే అన్నారు. అప్పటి కమిషనర్, మేము అన్ని పత్రాలు మున్సిపాలిటీ కార్యాల యం నిర్మాణం అనుమతి కోరుతూ దాఖలు చేసినప్పటికీ ఏ పార్టీ కా ర్యాలయానికి అనుమతులు లేవ ని, మమ్ము మభ్యపెట్టి తాత్స ర్యం చేశారన్నారని, మున్సిపాలిటీ మా కు నోటీసులు ఇచ్చినప్పుడు, తాము ఫైన్ తో డబ్బులు చెల్లిస్తా మని నిర్మాణానికి అనుమతి ఇవ్వా లని కోరినా మంత్రి ఆదేశంతో తిర స్కరించారన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో హైకోర్టును తాము ఆశ్ర యించామని, కానీ కోర్టు తీర్పు మా కు అనుకూలంగా రాలేదని వివరిం చారు. కోర్టు తీర్పును ఆసరా చేసు కున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్జిమెంట్ కాపీ రాక ముందే జెసిబి లు బుల్డోజర్లతో కా ర్యాలయాన్ని కులగొట్టాలని చూస్తు న్నారని తీవ్రంగా విమర్శించారు. జడ్జిమెంట్ కాపీ అందిన వెంటనే మేము పై కోర్టు లో అప్పీల్ చేస్తా మని అప్పటివరకు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని (BRS Party Office) కూల్చవద్దని అధి కారులకు విజ్ఞప్తి చేశారు. అంతవ రకు పార్టీ కార్యాలయాన్ని ప్రభు త్వ అవసరాలకు సమావేశాలకు వాడుకోవచ్చని, పైకోర్టు తీర్పు వచ్చాక నిర్ణయం తీసుకోవచ్చని, జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో ఏ పార్టీ కార్యాలయానికి కూడా అనుమతులు లేవని, మరి అన్ని పార్టీల కార్యాలయాలకు కూడా ఇలాంటి నిబంధనలు వర్తింప చేస్తారా అని మంత్రిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూల్చడాలే తప్ప నిర్మిం చడాలు లేవని, ఓవైపు రాహుల్ గాంధీ (Rahul Gandhi) బిజెపి బుల్డోజర్ సంస్కృతి పాటిస్తున్నదని విమర్శిస్తుంటే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అదే సంస్కృతిని రాష్ట్రం లోపాటింపజేస్తుందన్నారు. తమ హయాంలో ఎన్నడూ కూడా ఇ లాంటి పనులు చేయలేదని ఏ పార్టీ కార్యాలయాన్ని ద్వంసం చేయాల ని చూడలేదన్నారు. దయచేసి అ న్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయమై స్పందించి, ప్రజాస్వా మ్య వ్యవస్థను నిలబెట్టాలని కో రారు.అనంతరం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, నకిరేకల్ మాజీ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్యలు బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సి పల్ మాజీ చైర్మన్ మందడి సైది రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, కంచనపల్లి రవీందర్ రావు, కౌన్సిలర్ మారగోని గణేష్, జమాల్ ఖాద్రి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి,గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, కందుల లక్ష్మ య్య, బడుపుల శంకర్, ఊట్కూ రు సందీప్ రెడ్డి, నారగోని నరసిం హ, దొడ్డి రమేష్,మోదుగురాజ వర్ధన్ రెడ్డి, పేర్ల అశోక్, శంషుద్దీన్, బి పంగి కిరణ్ అంబటి ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు.