Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kandula Tejasvi: కరణం మల్లీశ్వరిని తలపిస్తోన్న కందుల తేజ(o)స్విని

–వెయిట్ లిఫ్టింగ్ లో నల్లగొండ యువకిషోరం
–అంచలంచెలుగా ఎదుగుతూ రికా ర్డులు బద్దలు కొడుతోన్న వైనం
–వరుస ప్రయత్నాల్లో కొనసాగిస్తో న్న విజయాల పరంపర పర్వం
–నూతనోత్తేజంతో సివిల్స్ లోనూ సక్సెస్ కావడమే లక్ష్యం
–జాతీయస్థాయిలోనూ రాణించా లని పట్టుబడుతోన్న తెలుగుతేజం

Kandula Tejasvi: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ కందుల వెంకటరమణ తనయ కందుల తేజస్విని (Kandula Tejasvi) రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. విశ్వవిజేత కర ణం మల్లీశ్వరి ని తలపిస్తూ వెయి ట్ లిఫ్ట్ పోటీల్లో సంచలనాలు సృ ష్టిస్తూ దూసుకుపోతోంది. వెయిట్ లిఫ్ట్ పోటీల్లో ఈ నల్లగొండ యువ కిషోరo అంచలంచలుగా ఎదుగు తూ తన రికార్డులను బద్దలు కొడు తోంది. వెయిట్ లిఫ్ట్ (Weight lift) లో ప్రకాశిస్తు న్న ఈ కందుల తేజస్విని ఇటీవల వరుస ప్రయత్నాలతో విజయాల పరంపర పర్వాన్ని కొనసాగిస్తోంది. వరుస విజయాలతో ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్న ‘తేజు’ నూతనోత్తే జంతో సివిల్స్ లోనూ సక్సెస్ కావ డమే లక్ష్యంగా కంకణ బద్దురాలై ముందుకు సాగుతోంది. తాజా విజ యాల పరంపరను కొనసాగిస్తూ జాతీయ స్థాయిలోనూ రాణించా లని పట్టుబడుతోoది. అవకాశాలు అందిపుచ్చుకొని మహిళలు ఏ రం గంలోనైనా రాణించగలరనడానికి కందుల తేజస్విని నిలువెత్తు నిద ర్శనంగా నిలుస్తోంది.తమ శక్తి సా మర్ధ్యాలకు మరింతగా పదును పెడుతూ ఆత్మవిశ్వాసంతో ముం దడుగు సాగుతున్నారు.

ఈ క్రమం లోనే నల్లగొండ కరణం మల్లీశ్వరిగా ప్రాచుర్యంలోకి ఇప్పుడిప్పుడే అడు గిడుతోన్న కందుల తేజస్విని మహి ళా సమాజానికి ఆదర్శవం తంగా నిలుస్తోంది. అనుకున్నదే తడువు గా ఎంతటి కఠినతరమైన పనినైనా అలవోకగా పురుషులతో సమానం గా నిలుస్తున్న కోవలో కందుల తేజ స్విని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల వెయిట్ లిఫ్ట్ పోటీల్లో తేజు చూపిస్తోన్న ప్రతిభా పాఠవాలు పదుగురికి స్ఫూర్తిగా నిలిచింది. క్రీడల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యే క గుర్తింపు సాధిస్తోంది. సివిల్స్ లో కూడా ఇదే తరహా ఉత్తమ ప్రదర్శన ద్వారా అనుకున్న తీరాలకు చేరుకో వాలన్న కుతూహలాన్ని తేజస్విని వ్యక్తపరుస్తోంది. ఓ వైపు క్రీడా పోటీ ల్లో రాణిస్తూనే ఉన్నత చదువుల్లో సైతం మనస్సు లగ్నం చేస్తూ విజయాలు అందుకుంటున్న తేజస్విని పై నల్లగొండ సమాజం ప్రశంసల జల్లులు కురిపిస్తోంది.

తాజాగా మరో విజయం సొంతం… నల్లగొండ పట్టణానికి చెందిన ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ కందుల వెంకటరమణ గౌడ్, భార్గవి దంపతుల కుమార్తె కందుల తేజ స్విని (Kandula Tejaswini) గౌడ్ పవర్ లిఫ్టింగ్ క్రీడలో అదరగొట్టింది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఐపీఎస్ అకాడమీలో బిఏ థర్డ్ ఇయర్ చదువుకుంటూనే మరోవైపు క్రీడ ల్లో తన ప్రత్యేకతను చాటుకుం టుంది, ఈ యువతి ఇటీవల హైద రాబాదులో జరిగిన తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల అండర్ 19 పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 150 కేజీల విభాగంలో విజేతగా నిలిచి చాంపి యన్షిప్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో మొత్తంగా 40 మంది యువతులు పాల్గొనగా అందులో తేజస్విని ప్రథ మ స్థానంలో నిలిచి రికార్డు సృష్టిం చింది. తొలి ప్రయత్నంలోనే ఛాంపి యన్ షిప్ సాధిం చి అమ్మాయి లకు స్ఫూర్తిగా నిలిచింది. పవర్ లిఫ్టింగ్ అసోసియే షన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ ఇండియా ప్రెసిడెంట్ (President of Congress India) రేణుక కోశాధికారి జి విజయ సారథ్యంలో పవర్ లిఫ్టింగ్ లో మెలుకువలు నేర్చుకుని ఆరి తేరింది. రెండో ప్రయత్నంలో మరో రికార్డు.. ఈనెల 24వ తేదీన హైదరాబాదులోని జిమ్ లో జరి గిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో సైతం గెలుపొంది మళ్ళీ మొదటి స్థానంలో నిలిచింది.

నల్లగొండలోని ఎఫ్డిఎఫ్ జిమ్ లో ప్రత్యేక శిక్షణ…
నల్లగొండలోని ఎఫ్డిఎఫ్ జిమ్ములో వారం రోజుల నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందుతుంది జాతీయ స్థా యి పోటీల్లో రాణించాలని పట్టు దలతో నిత్య సాధన చేస్తోంది. భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీల్లో విజేతగా నిలిచి పథకం సాధించడమే గేయంగా ముందు సాగుతున్నట్లు కందుల తేజస్విని వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రస్థాయి చాంపి యన్షిప్ సాధిం చిన తేజస్విని కి అభి నందనల వెల్లువ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్ట ర్ సి నారాయణరెడ్డి (Narayana Reddy), అదనపు కలెక్టర్ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందిస్తూ వెయిట్ లిఫ్ట్ లో మరింత ఉన్నత శిఖరాలకు చేరు కోవాలని ఆశీర్వదించి ఆకా క్షించా రు.

జాతీయ స్థాయిలో విజేతగా నిలుస్తా: తేజస్విని
సోషల్ మీడియాలో చూసిన పవర్ లిప్టింగ్ పోటీల తీరును పదేపదే చూసి తాను ఆకర్షితులయ్యారు తాను కూడా పవర్ లిఫ్టింగ్ పోటీ లో పాల్గొని సత్తా చాటాలని భావించిన, అందుకే పిడబ్ల్యుసి అధ్యక్షురాలు రేణుక (renuka)ఆధ్వర్యంలో శిక్షణ పొంది పొంది రాష్ట్రస్థాయి పోటీల్లో ఛాంపియన్షిప్లు సాధించా అదే స్ఫూర్తితో జాతీయస్థాయిలో జరిగే పవర్ లిఫ్టింగ్ పోటీలో కూడా పాల్గొని విజేతగా నిలిచేందుకు నిత్య సాధన చేస్తున్న దీనితో పాటు ఐపీఎస్ సాధించేందుకు పట్టుదలతో చదువుకుంటున్న ఐపీఎస్ I(ips) సాధించాలనేదే నా ధ్యేయమని స్పష్టం చేసింది.