–బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గత రాత్రి టీవీ9 ప్రతినిధిపై సినీ నటుడు మంచు మోహన్ బాబు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం హేయమైన చర్య అని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేం దర్ తీవ్రంగా ఖండించారు. సమా జంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన సినీనటుడు తన కుటుంబంలో జరుగుతున్న కలహాల నేపథ్యంలో తన ప్రతిష్టను స్థాయిని మరిచి వివరణ కోరిన టీవీ9 ప్రతినిధిపై తీవ్రంగా దాడి చేసి గాయపరచడం అతని దురహంకారానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా తను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ టీవీ9 ప్రతినిధికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా వెలికితీసి ప్రజలకు చేరవేసే జర్నలిస్టులపై భవి ష్యత్తులో ఇలాంటి ఘటనలు పున రావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం మంచు మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్ర మంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, నియో జకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, కౌకూరి వీరాచారి, జిల్లేపల్లి సాయి, కిషోర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.