Kavitha: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మద్యం కుంభకోణం కేసులో 166 రోజులుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం బెయిల్ పై (bail)విడుదల కావడం పట్ల బీ ఆర్ఎస్ (brs) పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో కార్యకర్తలు సంబరాలు నిర్వహిం చారు. కవిత విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గడియారం సెంటర్ వద్ద కార్యకర్తలు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా బోనగిరి దేవేందర్ మాట్లాడుతూ బీ ఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే బిజెపి కల్వకుంట్ల కవితను తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపిందని ఆరోపించారు. బిజెపి తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపించినా కవిత కడిగిన ముత్యంలా జైలు (jail) నుంచి బయటకు వచ్చిందన్నారు. జైలుకు పంపించి నంత మాత్రాన బీ ఆర్ఎస్ బిజెపి పన్నిన కుతంత్రాలకు భయపడేది లేదన్నారు.
బిడ్డను జైలుకు పంపి కెసిఆర్ ను లొంగదీసుకోవాలని అనుకోవడం బిజెపి బ్రమేనని అన్నారు. కవితపై అక్రమ కేసులు బనాయించి జైలుకు (jail) పంపించినం దుకు బిజెపి రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుం దని హెచ్చరించారు. రాజకీయ కక్షతోనే కవితను జైలుకు పంపిం చారన్నది బహిరంగ రహస్యం అన్నారు. బిజెపి చేసిన అన్యా యాలను బీ ఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ గ్రామాన వివరించి ఆ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామని దేవేందర్ devendar) హెచ్చరించారు. ఈ కార్య క్రమం లో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి, రంజిత్, కంకణాల వెంకట్ రెడ్డి, కట్ట శ్రీను, వజ్జే శ్రీను విద్యార్థి నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున, అనిల్, చంద్రశేఖర్, విజయ్, నేతాజీ, వీరమళ్ళ భాస్కర్, కంచర్ల విజయ రెడ్డి, చామకూరి లింగస్వామి, అయితగోని సతీష్ స్వామి, రాజు మున్నా, గణేష్, బాలాజీ నాయక్, కైసర్ పోతేపాక నవీన్, ఔ రఘు తదితరులు పాల్గొన్నారు.